Abn logo
Apr 9 2020 @ 00:27AM

రిలయన్స్‌ ‘కరోనా’ బీమా పాలసీ

కరోనా వైరస్‌ చికిత్సకు బీమా కవరేజీ కల్పించేందుకు ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టినట్లు రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించింది. కరోనా పాజిటివ్‌ అని తేలితే పాలసీదారుకు 100 శాతం సమ్‌ ఇన్‌స్యూర్డ్‌ను ఏకమొత్తంగా ఆఫర్‌ చేయడం జరుగుతుందని సంస్థ తెలిపింది. ఒకవేళ క్వారంటైన్‌ అయితే 50 శాతం లభించనుంది. మూడు నెలల నుంచి 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ పాలసీకి అర్హులని, రూ.25,000 నుంచి రూ.2 లక్షల వరకు బీమా కవరేజీ కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement
Advertisement
Advertisement