రిలయన్స్... మొన్న భారీ పతనం... నేడు పరుగు...

ABN , First Publish Date - 2021-11-26T20:59:00+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర ఈ రోజు... ఆరు శాతానికి పైగా లాభపడింది. సౌదీ ఆరామ్‌కోతో డీల్‌కు బ్రేక్ పడిన తర్వాత వరుసగా ఈ స్టాక్ నష్టపోతూ వస్తోంది. రూ. 2,500 కు పైగా ఉన్న రిలయన్స్ షేర్ రూ. 2,300 స్థాయికి పడిపోయింది.

రిలయన్స్... మొన్న భారీ పతనం... నేడు పరుగు...

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర ఈ రోజు... ఆరు శాతానికి పైగా లాభపడింది. సౌదీ ఆరామ్‌కోతో డీల్‌కు బ్రేక్ పడిన తర్వాత  వరుసగా ఈ స్టాక్ నష్టపోతూ వస్తోంది.   రూ. 2,500 కు పైగా ఉన్న రిలయన్స్ షేర్ రూ. 2,300 స్థాయికి పడిపోయింది. కాగా... ఈ రోజు... రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక అడుగుల నేపధ్యంలో స్టాక్ పరుగులు పెట్టింది. ఉదయం నుండి అంతకంతకూ పెరుగుతూ... 6.36 శాతం లాభపడింది. ఈ క్రమంలో... ఈ స్టాక్ రూ. 149.60 ఎగసి, రూ. 2,501 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో రిలయన్స్ స్టాక్   రూ. 2,351 వద్ద ముగిసింది. ఈ రోజు...  రూ. 2,373 వద్ద ప్రారంభమై, రూ. 2,502 వద్ద గరిష్టాన్ని, రూ. 2,357 వద్ద కనిష్టాన్ని తాకింది.


రిలయన్స్ షేర్ జంప్... కారణమిదే... 

గ్యాసిఫికేషన్ అసెట్స్ రీస్ట్రక్చర్ నేపధ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ పరుగు పెట్టింది. సంస్థకు చెందిన గ్యాసిఫికేషన్ అండర్‌టేకింగ్‌ను పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా బదలీ చేసేందుకు నిర్ణయం జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు ఒక స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌ను అమలు చేయాలని ఆర్‌ఐఎల్  బోర్డు నిర్ణయించింది. గతంలో ఇంధనగా పని చేసిన రిఫైనరీ ఆఫ్-గ్యాస్‌ను రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్(ఆర్‌జీసీ) కోసం ఫీడ్ స్టాక్‌గా వినియోగిస్తున్నారు. దీంతో ఎనర్జీ అవసరాలను తీర్చడానికి సింగ్యాస్ లేదా సింథటిక్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలన్న  లక్ష్యంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును రిలయన్స్ ఏర్పాటు చేసింది. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఒలెఫిన్స్ ఉత్పత్తి సాధ్యపడిన విషయం తెలిసిందే. 


ఈ క్రమంలో... ఇంధనంగా వాడే సింథటిక్ గ్యాస్ సరఫరా విశ్వసనీయత పెరిగి, ఎనర్జీ కాస్ట్ అశ్థిరత తగ్గింది. జామ్‌నగర్ రిఫైనరీలో వినియోగం కోసం హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు సింథటిక్ గ్యాస్‌ను కూడా వినియోగిస్తారు. రిలయన్స్ గ్యాసిఫికేషన్ ఆస్తుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించిన నేపధ్యంలో... స్టాక్ పుంజుకుంది. రీ-సైక్లింగ్ చేయగల, స్థిర నెట్-జీరి కార్బన్‌తో కూడిన పోర్ట్‌పోలియోపై రిలయన్స్ దృష్టి సారించింది. ఎనర్జీ అవసరాలు తీర్చేందుకు పునరుత్పాదకత, అధిక విలువ కలిగిన పదార్థాలు, రసాయనాలకు మారడం ద్వారా ఇది సాధ్యమని భావిస్తున్నారు. 


పునరుత్పాదక శక్తిని ప్రాథమిక వనరుగా...  పునరుత్పాదక శక్తిని ప్రాథమిక వనరుగా రిలయన్స్ క్రమంగామార్చుకుంటోంది. అప్పుడు సీవన్ కెమికల్స్, హైడ్రోజన్ సహా అధిక విలువ కలిగి రసయనాల కోసం అప్‌గ్రెడేషన్ అయితే మరిన్ని సింథటిక్ గ్యాస్‌లు అందుబాటులోకొస్తాయి. హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియలో విడుదలయ్యే అధిక సాంధ్రత కలిగిన కార్పన్ డై ఆక్సైడ్‌ను సులభంగా సంగ్రహించవచ్చు. దీంతో కార్బన్ క్యాప్చర్ ధర గణనీయంగా తగ్గిపోతుంది. ఈ చర్యలు జామ్‌నగర్ కాప్లెక్స్ కార్బన్ పుట్‌ప్రింట్‌ను తగ్గించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. 


అనుమతి అవసరం... 

సెపరేషన్ స్కీమ్ 2022 మార్చి 31 నుండి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఈ స్కీంకు షేర్ హోల్డర్లు, ఎన్సీఎల్టీ, ఇతర రెగ్యులేటరీ అథారిటీల అనుమతులు అవసరం. ఇక... 2019 ఆగస్టులో జరిగిన షేర్ హోల్డర్ల ఏజీఎం సమావేశంలో ఓ2సీ(ఆయిల్ టు కెమికల్స్‌)లో... 10 % వాటాను విక్రయిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందానికి బ్రేక్ తర్వాత రిలయన్స్ స్టాక్ నాలుగు శాతం నష్టపోయింది. అయితే తాము కొత్త ఎనర్జీ వ్యాపారంపై దృష్టి సారిస్తున్నట్లు రిలయన్స్ అప్పుడే వెల్లడించింది. 

Updated Date - 2021-11-26T20:59:00+05:30 IST