Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాదుడుకు సిద్ధమైన జియో.. ప్రీపెయిడ్ చార్జీల పెంపు

న్యూఢిల్లీ: ఊహించినదే నిజమైంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా బాటలోనే నడుస్తూ రిలయన్స్ జియో కూడా యూజర్లకు షాకిచ్చింది. అన్ని అన్‌లిమిటెడ్ ప్లాన్ల ధరలను పెంచినట్టు తాజాగా ప్రకటించింది. కొత్త టారిఫ్ ధరలు డిసెంబరు ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. జియో‌ఫోన్ యూజర్ల అన్‌లిమిటెడ్ ప్లాన్ ధరను కూడా పెంచేసింది. ప్రస్తుతం ఇది రూ. 75తో అందుబాటులో ఉండగా, ఇకపై రూ. 91 చెల్లించాల్సి ఉంటుంది.


జియోలో అతి తక్కువ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ. 129 ప్యాక్ ధర డిసెంబరు నుంచి రూ. 155 కానుంది. ఇందులో 28 రోజుల కాలపరిమితితో 2 జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రూ. 149, రూ. 199 ప్లాన్ల ధరలను వరుసగా రూ. 179, రూ. 239కి పెంచింది. రూ. 179 ప్లాన్‌లో రోజుకు ఒక జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రూ. 239 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 


జియోలో అత్యంత పాపులర్ ప్లాన్ అయిన రూ. 249 ప్యాక్ ధరను రూ. 299కి పెంచింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రూ. 329 ప్లాన్ ధరను రూ. 395కి పెంచింది. ప్రయోజనాల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఇందులో 6జీబీ డేటా 84 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. అపరిమిత కాల్స్, 1000 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 


రూ.555 ప్లాన్‌ను రూ. 666కి, రూ. 599 ప్లాన్‌ను 719కి, రూ. 1299 ప్లాన్2ను 1559కి, రూ. 2399 ప్లాన్‌ను రూ. 2879కి పెంచింది. డేటా యాడ్ ఆన్ ప్యాక్స్‌ ధరలను కూడా పెంచిన జియో.. రూ. 51ని రూ. 61కి, రూ. 101 ధరను రూ. 121కి, రూ. 251 ధరను రూ. 301కి పెంచింది.

Advertisement
Advertisement