బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌పై రిలయన్స్‌ నజర్‌?

ABN , First Publish Date - 2020-09-25T06:11:46+05:30 IST

రిటైల్‌ వ్యాపారంలో మరింత పట్టు బిగించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సమాయత్తమవుతోంది...

బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌పై రిలయన్స్‌ నజర్‌?

డీల్‌ విలువ రూ.3,000 కోట్లు!


ముంబై : రిటైల్‌ వ్యాపారంలో మరింత పట్టు బిగించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సమాయత్తమవుతోంది. ఆర్‌ఐఎల్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ ఇప్పటికే ఫ్యూచర్‌ గ్రూప్‌ను చేజిక్కించుకోగా.. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా ‘బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌’ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న ఎలకా్ట్రనిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఎంఐఎల్‌)ను రూ.3,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక పేర్కొంది. కొనుగోలుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని తెలిపింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇరు సంస్థలు అధికారికంగా స్పందించలేదని పేర్కొంది. 


ఏపీ, తెలంగాణల్లో 60 స్టోర్లు 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈఎంఐఎల్‌.. బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ పేరుతో 60 రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. సంస్థలో మొత్తం 1,200 మంది ఉద్యోగులున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలతో పాటు లేటెస్ట్‌ మోడల్‌ మొబైల్‌ ఫోన్ల అమ్మకాలకు తెలుగు రాష్ట్రాల్లో  బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌, కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచింది. దీంతో ఈ రిటైల్‌ చెయిన్‌ కొనుగోలు ద్వారా రిటైల్‌ మార్కెట్లో మరింత పట్టుబిగించవచ్చని రిలయన్స్‌ భావిస్తోంది. 

Updated Date - 2020-09-25T06:11:46+05:30 IST