రూ. 4 లక్షల కోట్లు దాటిన రిలయన్స్ ఎం క్యాప్...

ABN , First Publish Date - 2021-06-03T20:50:09+05:30 IST

వరసగా ఏడు సెషన్లలో లాభపడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు... గురువారం మార్కెట్లలో రూ. 2,250 కి ఎగసింది.

రూ. 4 లక్షల కోట్లు దాటిన రిలయన్స్ ఎం క్యాప్...

ముంబై : వరసగా ఏడు సెషన్లలో లాభపడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు... గురువారం మార్కెట్లలో రూ. 2,250 కి ఎగసింది. ఈ ఏడు సెషన్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 14.53 శాతం లాభపడింది. దీంతోపాటు...  రూ. 14,04,123.26కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ సాధించడం విశేషం. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


రికార్డు స్థాయిలో నిధులను సమీకరించుకోవడం, అప్పులు తీర్చివేయడంతో పటిష్టమైన బ్యాలెన్స్ షీట్ సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్... ఇప్పుడు మంచి లిక్విడిటీ అందుబాటులో ఉన్న కంపెనీగా స్వయంగా సంస్థ అధినేతే ముఖేష్ అఅంబానీ ప్రకటించారు. ఇదిలా ఉండగా... జియో, ఆయిల్ టూ కెమికల్, రిటైల్ రంగాల్లో మరింత ఎదుగుదలకు లయన్స్ మూడంచెల వ్యూహంతో రాబోయే రోజుల్లో మరింత జోరు ప్రదర్శింస్తుందన్న అంచనాలున్నాయి. 

Updated Date - 2021-06-03T20:50:09+05:30 IST