స్పీడు తగ్గిన రిలయన్స్‌ రిటైల్‌

ABN , First Publish Date - 2021-05-10T06:33:15+05:30 IST

రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపార విస్తరణ జోరు తగ్గింది. రెండేళ్ల క్రితం కంపెనీ ఈ విషయంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెండో స్థానానికి పడిపోయింది...

స్పీడు తగ్గిన రిలయన్స్‌ రిటైల్‌

  • వృద్ధిలో ప్రపంచంలో రెండో స్థానం

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపార విస్తరణ జోరు తగ్గింది. రెండేళ్ల క్రితం కంపెనీ ఈ విషయంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది.  2019-20 ఆర్థిక సంవత్సరంలో రెండో స్థానానికి పడిపోయింది. ప్రము ఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 250 ప్రముఖ రిటైల్‌  కంపెనీలను పరిశీలించి డెలాయిట్‌ రూపొందించిన జాబితాలో భారత్‌ నుంచి ఒక్క రిలయన్స్‌ రిటైల్‌కు మాత్రమే చోటు దక్కింది. 2019లో ప్రపంచంలో 56వ అతి పెద్ద రిటైల్‌ కంపెనీగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ 2020లో మూడు స్థానాలు ముందుకు జరిగి 53వ స్థానానికి ఎదిగింది. 2019తో పోలిస్తే 2020లో 41.8 శాతం వృద్ధి సాధించడం, స్టోర్ల సంఖ్య 13.1 శాతం పెంచుకోవడం కలిసొచ్చాయని డెలాయిట్‌ తెలిపింది. 


Updated Date - 2021-05-10T06:33:15+05:30 IST