Advertisement
Advertisement
Abn logo
Advertisement

రిలయన్ప్... రూ. 2,900..! బ్రోకర్ల ధీమా..!

ముంబై : జియో టారిఫ్ ప్రకటన నేపధ్యంలో.... రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో మూడు శాతం పెరిగాయి. ఆ తర్వాత తగ్గుతూ వచ్చి...  1.04% శాతంతో, రూ. 2,437.70 వద్ద సెటిలయ్యాయి. 

టారిఫ్‌ పెంపుతో, ఆర్‌ఐఎల్‌లో 20 % అప్‌సైడ్‌ ప్రైస్‌ లక్ష్యాలను కొన్ని బ్రోకరేజీలు ప్రకటించాయి. జేపీ మోర్గాన్... ఈ కంపెనీలో తన 2022-24 ఆదాయ అంచనాలను 5-23 శాతం మేర పెంచింది. కాగా... టారిఫ్‌ పెంపు తమ అంచనాల కంటే మెరుగ్గా ఉందని చెబుతోంది మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్. ఇరవై శాతం టారిఫ్ పెంపు వల్ల ఆదాయం రూ. 15 వేల కోట్లు, ఎబిటా రూ. 9,700 కోట్లు పెరగవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. ఇది మొత్తం ఏఆర్‌పీయూను(యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌) రూ. 145 నుంచి రూ. 175 కు పెంచుతుందని పేర్కొంది.


ఈ స్టాక్‌కు తానమిచ్చే ప్రైస్‌ టార్గెట్‌ను రూ. 2,900 గా ఈ బ్రోకరేజ్‌ వెల్లడించింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే ఇది 20 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ఆర్‌ఐఎల్‌ను 'యాడ్' నుంచి 'బయ్‌'కి కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అప్‌గ్రేడ్ చేసింది. ఈ స్క్రిప్‌పై రూ. 2,850 లక్ష్యాన్ని సూచించింది. రిఫైనింగ్, పాలిస్టర్ మార్జిన్లలో బలం, టెలికం టారిఫ్‌ల పెరుగుదల, రిటైల్‌లో మంచి పెరుగుదల, ఈ అండ్ పీ కాంట్రిబ్యూషన్‌లో పెరుగుదలను గణించి, వచ్చే రెండేళ్లలో, ఆర్‌ఐఎల్ ఎబిటా 26 శాతం సీఏజీఆర్‌తో పెరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది. 


కాగా... 2019 డిసెంబరులోని టారిఫ్ పెంపు సమయంలో, జియో ఎబిటాలో వృద్ధి 4-5 త్రైమాసికాలపాటు క్రమంగా పెరుగుతూ వచ్చింది.  దీర్ఘకాలంపాటు కంపెనీని అట్టిపెట్టుకుని ఉండే కస్టమర్ల హై షేర్‌ను ఇది హైలైట్‌ చేస్తే, మిగిలిన రెండు పీర్స్‌ ఈ విషయంలో విఫలమయ్యాయి. బ్రిటన్ టెలికం గ్రూప్ ‘బీటీ’ని చేజిక్కించుకునేందుకు ఆర్‌ఐఎల్ బిడ్‌ దాఖలు చేయనుందన్న వార్తల నేపధ్యంలో కూడా... ఈ రోజు స్టాక్‌ లాభపడింది. డచ్ టెలికం యూనిట్ కోసం బిడ్ వేయడం, అంబానీ గ్లోబల్ టెలికం ఆకాంక్షను సూచిస్తోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. 

Advertisement
Advertisement