ఆంధ్రా డేరాబాబాకు హైకోర్టు ఊరట... ఇంటి దగ్గర కలకలం

ABN , First Publish Date - 2020-05-28T17:56:52+05:30 IST

మహిళను మోసం చేసిన కేసులో విజయవాడకు చెందిన అచ్చిరెడ్డికి హైకోర్టులో ఒకింత ఊరట లభించింది. ఇతడిని ‘ఆంద్రా డేరాబాబా’ అప్పట్లో పిలిచారు. జాతకాల పేరుతో మహిళలను మోసం చేస్తున్నాడన్న ఆరోపణలపై అచ్చిరెడ్డి కేసులు ఎదుర్కొంటోన్న విషయం విదితమే. ఇదే క్రమంలో... తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మహిళను రూ. 50 లక్షల మేరకు మోసం చేసినట్లుగా నమోదైన కేసులో హైకోర్టు ఊరటను ఇచ్చింది.

ఆంధ్రా డేరాబాబాకు హైకోర్టు ఊరట... ఇంటి దగ్గర కలకలం

విజయవాడ : మహిళను మోసం చేసిన కేసులో విజయవాడకు చెందిన అచ్చిరెడ్డికి హైకోర్టులో ఒకింత ఊరట లభించింది. ఇతడిని ‘ఆంద్రా డేరాబాబా’ అప్పట్లో పిలిచారు. జాతకాల పేరుతో మహిళలను మోసం చేస్తున్నాడన్న ఆరోపణలపై అచ్చిరెడ్డి కేసులు ఎదుర్కొంటోన్న విషయం విదితమే. ఇదే క్రమంలో...  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మహిళను రూ. 50 లక్షల మేరకు మోసం చేసినట్లుగా నమోదైన కేసులో హైకోర్టు ఊరటను ఇచ్చింది.


బుధవారం తన కుటుంబ సభ్యులతో సహా విజయవాడలోని సాయిత్రిశక్తి నిలయం'లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. దాంతో అక్కడ కలకలం రేగింది. పోలీసులు రాగానే అచ్చిరెడ్డి... ముందు తడబాటుకు లోనైనా, అనంతరం హైకోర్టు  ఇచ్చిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులు తీసుకున్నాడు. అయితే ీఈ విషయం తెలియడంతో మరికొందరు వ్యక్తులు ఆయన ఇంటి వద్ద కొద్దిసేపు కలకలం సృష్టించారు.


ఇదీ విషయం... సరస్వతీదేవి నెలవైన పుణ్యక్షేత్రం 'బాసర' నుంచి తన ప్రయాణి  ప్రారంభమైందని అచ్చిరెడ్డి చెబుతుంటాడు. ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ అని, మరోసారి నిర్మల్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివానని చెబుతుంటాడు.   అనంతపురం జిల్లా పెనుగొండ సొంత పట్టణమని చెబుతుంటాడు. ఇతర వివరాలను మాత్రం చెప్పడు. ఇక విజయవాడ లోని కొత్తపేట దగ్గరలో ఉన్న కేబీఎన్ కళాశాల వెనుక... నాలుగు స్థంబాల మధ్య, నాలుగు సిమెంట్ రేకుల కప్పు... చుట్టూ చిరుగులు ఉన్న పాత చీరెలను చూట్టూ కట్టుకొని ఈ 'రూపాయి చిలక జోస్యం' మొదలెట్టాడు.


ఈ పథకంతో మొదట్లో రాబడి తక్కువగా ఉన్నా పొట్ట నింపుకునేవాడని చుట్టుపక్కలవారు చెబుతుంటారు. జనాలు మాత్రం చూడటానికి బాగా వచ్చేవారు. ఈ క్రమంలోనే... మహిళలను నెమ్మదిగా ఆకర్శించడం ప్రారంభించాడు. ఇదే సమయంలో...  అంటే జులై 28, 1982  న వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ 'లూనా' మీద చిలక, ఓ చిన్న పెట్టె, గవ్వలు పట్టుకొని రద్దీ ప్రాంతాల్లో, సినిమా థియేటర్ల ముందు కథ నడిపేవాడు.


ఈలోగా చెన్నైకి చెందిన 'మురుగన్ భూషణం'తో పరిచయమైంది. ఇదే క్రమంలో... చిలక జోస్యం నుంచి రైల్వేస్టేషన్ వద్ద హస్త ముద్రికలు చూసి చెప్పటం వరకు ఎదిగాడు. అలా నెమ్మదిగా భవానీపురం చేరుకున్నాడు. అక్కడ హెచ్‌బీ కాలనీలో 'సాయిత్రిశక్తి నిలయం' ఏర్పాటు చేశాడు.  ఈలోగా భూ దందాలపై పట్టు వచ్చింది. ఇతని విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి అభాసుపాలయ్యాడు కూడా. కాగా తనకు వచ్చిన ‘పేరు’ీతో ఓ మహిళను వంచించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ కేసులోనే కోర్టు నుంచి  అచ్చిరెడ్డి తాత్కాలికంగా ఉపశమనం పొందాడు. 

Updated Date - 2020-05-28T17:56:52+05:30 IST