వెన్ను నొప్పి దూరం!

ABN , First Publish Date - 2021-08-31T05:30:00+05:30 IST

ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సందర్భంలో వేధించే ఇబ్బంది ‘నడుము నొప్పి’. ఈ సమస్య ఎందుకు? కారణాలేంటి? ఎలాంటి నొప్పి ప్రమాదకరం? అనే విషయాలపై అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం!..

వెన్ను నొప్పి దూరం!

ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సందర్భంలో వేధించే ఇబ్బంది ‘నడుము నొప్పి’. ఈ సమస్య ఎందుకు? కారణాలేంటి? ఎలాంటి నొప్పి ప్రమాదకరం? అనే విషయాలపై అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం!


ఎక్కువ సమయం పాటు కూర్చుని చేసే ఉద్యోగాలు, స్థూలకాయులు, సరైన భంగిమ పాటించకుండా బరువులు ఎత్తడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడడం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు...ఇలా నడుము నొప్పికి బోలెడన్ని కారణాలు. ఉద్యోగులు ఎక్కువ సయమం కుర్చీలో ఒకే భంగిమలో కూర్చుని పని చేయడం వల్ల కూడా ఆ భారం వెన్ను మీద పడి, నొప్పి మొదలవవచ్చు. గృహిణులు స్థూలకాయులైతే, ఎక్కువ సమయంపాటు వంటగదిలో నిలబడి పని చేయడం వల్ల శరీర బరువు వెన్ను మీద పడి నొప్పి మొదలవవచ్చు. ఈ నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో, అలవాట్లలో, శరీర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి. బరువులు ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, బరువులు లేపాలి. స్థూలకాయులైతే అధిక బరువు తగ్గించుకోవాలి. ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని పని చేసేవాళ్లు తరచుగా లేచి పది నిమిషాలు నడుస్తూ ఉండాలి. వైద్యులను కలిసి కారణాలు తెలుసుకుని సూచనలను పాటించాలి.

Updated Date - 2021-08-31T05:30:00+05:30 IST