Advertisement
Advertisement
Abn logo
Advertisement

మత రాజకీయాలకు స్వస్తి పలకాలి

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు  రంగారెడ్డి

నల్లగొండ రూరల్‌, డిసెంబరు 1 :  దేశంలో బీజేపీ చేస్తున్న మత రాజకీయాలకు స్వస్తి పలకాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం పేరుతో రాజకీయాలు చేసి, అధికారం సాధించడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టడం, మతకలహాలు సృష్టించడానికి ఏకైక సాధనం గా సంఘపరివార్‌ పని చేస్తోందని అన్నారు. ర్యాలీలో సీపీఎం నాయకులు సయ్యద్‌ హాషం, సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, బండ శ్రీశైలం, నాగార్జున, లక్ష్మీనారయణ ఉన్నారు. మిర్యాలగూడలో  సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యుడు డబ్బీకార్‌ మల్లేష్‌ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో సిపిఎం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డా. మల్లు గౌతంరెడ్డి, రవి నాయక్‌, పరుశరాములు, అంజద్‌ ఆయూబ్‌, మంగారెడ్డి వినోద్‌ నాయక్‌, ఖాజామొయినొద్దీన్‌, ముస్లీం వెల్పేర్‌ సొసైటీ అధ్యక్షులు మహమ్మద్‌ చౌహుస్‌, సమీఖాద్రి, సాజీద్‌ఖాన్‌ పాల్గొన్నారు. దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలనీ సీపీఎం జిల్లా కమీటీ సభ్యులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య డిమాండ్‌ చేశారు. చిట్యాలలో  సీపీయం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అరూరి శ్రీను, నారబోయిన శ్రీనివాస్‌, జిట్ట సరోజ, అబ్దుల్‌ సమద్‌, హైమద్‌, అబ్దుల్‌ రజాక్‌ పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అవుతా సైదులు హాలియాలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బహిరంగంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటన చేస్తూ, ప్రజలను మతాల వారీగా విభజించి ఓట్లుగా మలుచుకున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సీతారాములు, రొండి శ్రీను, నాయకులు వేములకొండ పుల్లయ్య, సైదులు, విష్ణు ఉన్నారు. 

Advertisement
Advertisement