కరోనా పరీక్షలకు ఆస్పత్రికి తీసుకెళ్తే.. బాత్రూంలోకి వెళ్లి కిటికీకి ఉరేసుకుని..

ABN , First Publish Date - 2020-07-18T00:13:31+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రిమాండ్‌ ఖైది గురువారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాన్సువాడ డీఎస్పీ దామోధర్‌రెడ్డి, నిజామాబాద్‌ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లాకు

కరోనా పరీక్షలకు ఆస్పత్రికి తీసుకెళ్తే.. బాత్రూంలోకి వెళ్లి కిటికీకి ఉరేసుకుని..

నిజామాబాద్‌ ఆసుపత్రిలో రిమాండ్‌ ఖైది ఆత్మహత్య

అత్యాచార యత్నం కేసులో అరెస్టైన  బాలాజీ 

కరోనా పరీక్షల నిమిత్తం ఐసోలేషన్‌ వార్డుకు తరలింపు


నిజామాబాద్‌ అర్బన్‌(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రిమాండ్‌ ఖైది గురువారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాన్సువాడ డీఎస్పీ దామోధర్‌రెడ్డి, నిజామాబాద్‌ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లాకు చెందిన బాలాజీ (24) బాన్సువాడలో బాలి కపై ఇటీవల అత్యాచార యత్నం చేశాడు. ఈ కేసులో బాన్సువాడ పోలీసులు బాలాజీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఇటీవల మహారాష్ట్రలో ఉన్నాడు. అతడు కొంత అనారోగ్యంగా ఉండడంతో నిజామాబాద్‌ జిల్లా జైలుకు రిమాండ్‌ నిమిత్తం తరలించే క్రమంలో కరోనా పరీక్షల నిమిత్తం బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో బాత్‌రూంకు వెళ్లిన బాలాజీ కిటికీకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శిక్ష పడుతుందనే అనుమానంతోనే రిమాండ్‌ ఖైది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2020-07-18T00:13:31+05:30 IST