కొవిడ్‌ నుంచి కోలుకునే సమయాన్ని తగ్గిస్తున్న ‘రెమ్‌డెసివిర్‌’ : అమెరికా

ABN , First Publish Date - 2020-05-28T08:39:45+05:30 IST

కరోనా రోగుల చికిత్సకు వాడుతున్న యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’తో అమెరికా నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో

కొవిడ్‌ నుంచి కోలుకునే సమయాన్ని తగ్గిస్తున్న ‘రెమ్‌డెసివిర్‌’ : అమెరికా

వాషింగ్టన్‌, మే 27: కరోనా రోగుల చికిత్సకు వాడుతున్న యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’తో అమెరికా నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలొచ్చాయి. తేలికపాటి, తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడిన 1,063 మంది రోగులపై ట్రయల్స్‌ నిర్వహించగా సగటున ఒక్కో రోగి 11 రోజుల్లోనే కోలుకున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజె‌స్‌(ఎన్‌ఐఏఐడీ)గుర్తించింది. రెమ్‌డెసివిర్‌తో చికిత్స పొందినవారు ఇన్ఫెక్షన్‌ ముప్పు నుంచి బయటపడేందుకు సగటున 11 రోజులు పట్టగా.. ప్లేస్‌బో(ఔషధాన్ని పోలిన పదార్థం)తో చికిత్స పొందినవారు కోలుకోవడానికి 15 రోజులు పట్టిందని వెల్లడించారు. 

Updated Date - 2020-05-28T08:39:45+05:30 IST