ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రెమిడిసివర్ ఇంజక్షన్ల కుంభకోణం

ABN , First Publish Date - 2021-05-13T01:34:18+05:30 IST

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రెమిడిసివర్ ఇంజక్షన్ల కుంభకోణం

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రెమిడిసివర్ ఇంజక్షన్ల కుంభకోణం

ఏలూరు, పశ్చిమగోదావరి: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెమిడిసివర్ ఇంజక్షన్ల కుంభకోణం జరిగింది. కోవిడ్ రోగులకు అవసరమైన రెమ్ డెసివీర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అధిక రేట్లకు అమ్మిన 10 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 13 రెమిడిసివర్ ఇంజక్షన్లు, రూ. 40 వేల నగదు, మూడు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో ముగ్గురు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది స్టాఫ్ నర్సులు రాయల వెంకటలక్ష్మి, లావణ్య, ల్యాబ్ టెక్నీషియన్ బొమ్మకంటి రవి బ్రహ్మయ్యలను కూడా అరెస్టు చేశారు. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-13T01:34:18+05:30 IST