వెంకీ మార్క్‌ వినోదం

ABN , First Publish Date - 2020-07-12T05:30:00+05:30 IST

విక్టరీ వెంకటేశ్‌ కెరీర్‌లో ‘బొబ్బిలి రాజా’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతవరకూ ఆయన నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, ‘బొబ్బిలి రాజా’ మరో ఎత్తని చెప్పాలి. ‘అయ్యో.. అయ్యో’ అనే మేనరిజమ్‌తో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు వెంకీ...

వెంకీ మార్క్‌ వినోదం

విక్టరీ వెంకటేశ్‌ కెరీర్‌లో ‘బొబ్బిలి రాజా’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతవరకూ ఆయన నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, ‘బొబ్బిలి రాజా’ మరో ఎత్తని చెప్పాలి. ‘అయ్యో.. అయ్యో’ అనే మేనరిజమ్‌తో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు వెంకీ. ఈ సినిమా బాక్సాపీసు ఢంకా బజాయించడమే కాకుండా అంతకుముందున్న రికార్డులన్నింటినీ చెరిపేశారు. వినోదాన్ని మిళితం చేసి అడ్వంచరెస్‌ ఫిల్మ్‌గా రూపొందించారు దర్శకుడు బి.గోపాల్‌. ‘ప్రతిధ్వని’తో పరిచయమైన ఆయనకు సురేశ్‌ సంస్థలో ఇది రెండో చిత్రం. 

సురేశ్‌ సంస్థ రజతోత్సవ సంవత్సరంలో రూపుదిద్దుకొన్న చిత్రం ‘బొబ్బిలి రాజా’. అంతకుముందు సురేశ్‌ సంస్థ నిర్మించిన ఒకటో, రెండో చిత్రాలకు నిర్మాతగా పేరు పెట్టినప్పటికీ వాటి  నిర్మాణంలో ఆయన పాత్ర తక్కువే కానీ ‘బొబ్బిలి రాజా’ చిత్రకథ ఎన్నుకోవడం దగ్గర నుంచి తొలి కాపీ వచ్చే వరకూ ప్రతి దశలోనూ సురేశ్‌బాబు ప్రమేయం ఉంది. జనం మెచ్చే వినోదాత్మక చిత్రం అందించాలనే లక్ష్యంతో ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. వెళ్లిన (ఫారెస్ట్‌) లొకేషన్‌కు ఐదారుసార్లు వెళ్లి తను అనుకొన్న విధంగా వచ్చేవరకూ వదిలిపెట్టలేదు. చిత్ర నిర్మాణంలో జాప్యమైనా, ఖర్చు బాగా పెరిగినా వెనకడుగు వేయకుండా వర్క్‌ చేశారు. హాలెండ్‌, బెల్జియం దేశాల్లో పాటలు చిత్రీకరించారు. 

ఈ చిత్రకథ ప్రకారం ఓ ఫారెస్ట్‌ లొకేషన్‌ తప్పనిసరి. అందుకే ఎన్నో అడవులు చూసి చివరకు తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలోని ఆనమలై అడవులకు వెళ్లి 40 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. అలాగే పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు ఎక్కువగా సంచరించే ఆనకుండి షోలా, కరియన్‌ షోలా ప్రాంతాల్లో కూడా ఎంతో రిస్క్‌ తీసుకొని షూటింగ్‌ చేశారు. అంతవరకూ ఏ సినిమా షూటింగ్‌ జరగని అడవులవి. దట్టమైన అడవుల్లో షూటింగ్‌ చేయడంతో తెరపై ఆ సన్నివేశాలు చూస్తూ ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీలయ్యారు. 

యానిమేషన్‌ సాంగ్‌

‘బొబ్బిలి రాజా’ నిర్మాణ సమయంలోనే ‘హు ఫ్రేమ్డ్‌ రోజర్‌ రోబోట్‌’ హాలీవుడ్‌ చిత్రం విడుదలైంది. ఆ సినిమాలో ఆర్టిస్టులతో పాటు చిత్రం పొడవునా ఓ కార్టూన్‌ బొమ్మ కనిపిస్తుంది. ఆ సినిమా చూశాక ఆ సాంకేతిక ప్రక్రియలోనే ఓ సినిమా తీయాలనే ఆలోచన సురేశ్‌బాబుకు కలిగింది. అందుకే ప్రయోగాత్మకంగా ‘కన్యాకుమారీ.. కనపడదా దారి’ పాటను యానిమేషన్‌ వర్క్‌తో చిత్రీకరించారు. ఈ పాటలో వెంకటేశ్‌, దివ్యభారతి సహా బేబి ఎలిఫెంట్‌, పులులు, సింహాలు,  పాములు, ఎలుగుబంట్లు కూడా కనిపిస్తాయి. ఈ యానిమేషన్‌ వర్క్‌ చేయడానికి నాలుగున్నర నెలలు పట్టింది. 

‘బొబ్బిలి రాజా’ ఘన విజయం సాధించడంతో 1991 ఏప్రిల్‌ 14న హైదరాబాద్‌లోని నిజాం గ్రౌండ్స్‌లో 200 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించారు రామానాయుడు. దాసరి అఽధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ, శోభన్‌బాబు, మోహన్‌బాబు, రాజశేఖర్‌, రాఘవేంద్రరావు, విజయనిర్మల, శోభన, టి. సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దివ్యభారతి తొలి తెలుగు చిత్రం 

తన అందచందాలతో అందరినీ అలరించి, చిన్న వయసులోనే ఆర్ధాంతరంగా కన్నుమూసిన దివ్యభారతికి ‘బొబ్బిలిరాజా’ తెలుగులో తొలి చిత్రం . ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయాలని నిర్ణయించుకొన్న  తర్వాత  సురేశ్‌బాబు మూడు నెలలు కొత్త నటి కోసం అన్వేషించారు. మూడు నెలలు షూటింగ్‌ను వాయిదా వేశారు కూడా. చివరకు బాలీవుడ్‌ బ్రదర్స్‌ బోనీ కపూర్‌, అనిల్‌ కపూర్‌ దివ్యభారతిని పరిచయం చేశారు. ఆమె గ్లామర్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- వినాయకరావు

Updated Date - 2020-07-12T05:30:00+05:30 IST