మెదడులో రక్తం గడ్డల తొలగింపు

ABN , First Publish Date - 2022-01-24T06:03:16+05:30 IST

వైద్యుడి సలహా పాటించకుండా జలుబు, జ్వరాన్ని తగ్గించుకునేందుకు వాడిన హైడోస్‌ మందులతో రక్తస్రావమై అపస్మారకస్థితిలోకి వెళ్లిన రోగికి ఆదివారం మిర్యాలగూడ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.

మెదడులో రక్తం గడ్డల తొలగింపు
రోగితో వైద్యులు

 మిర్యాలగూడలో రోగికి అరుదైన శస్త్రచికిత్స

మిర్యాలగూడ అర్బన్‌, జనవరి 23: వైద్యుడి సలహా పాటించకుండా జలుబు, జ్వరాన్ని తగ్గించుకునేందుకు వాడిన హైడోస్‌ మందులతో రక్తస్రావమై అపస్మారకస్థితిలోకి వెళ్లిన రోగికి ఆదివారం మిర్యాలగూడ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి కుటుంబసభ్యులు, శ్రీబాలాజీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుల వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన సాయిని వెంకన్న రెండునెలల క్రితం జలుబు, జ్వరం తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు మందులు వినియోగించాడు. హైడోస్‌ మందులను వేసుకోవడంతో తలభాగంలో రక్తస్రావమై, ముక్కు ద్వారా రావడం మొదలైంది. క్రమంగా రక్తస్రావం తీవ్రత పెరిగి ఈ నెల 12న అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, మెదడు భాగంలో రక్తనాళాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. బయటకు వస్తున్న రక్తం మెదడుపై గడ్డరూపంలో పేరుకపోయినట్లు తమ పరీక్షల్లో వైద్యులు నిర్ధారించారు. రోగి కుటుంబసభ్యుల అనుమతి మేరకు శస్త్రచికిత్సా పద్ధతిలో తొలగించేందుకు న్యూరో సర్జన్లు డాక్టర్‌ శశాంక్‌, డాక్టర్‌ సంతో్‌షకుమార్‌తో కూడిన వైద్యబృందం సిద్ధపడింది. తల నుదురు, వెనుకభాగంలో పుర్రె(స్కల్‌)ను తొలగించి మెదడుపై రక్షణగా ఉండే లోబ్‌బోన్‌ను 30సెం.మీటర్ల మేర వేరుచేసి రక్తపుగడ్డలను తొలగించేందుకు సుమారు మూడు గంటలపాటు శ్రమించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మాత్రమే నిర్వహించే ఈ అరుదైన శస్త్రచికిత్సను ఇక్కడి వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారని ఆస్పత్రి ఎండీ గోపీనాథ్‌ తెలిపారు. రోగి ఆరోగ్యం నిలకబడగా ఉందని ఆయన వివరించారు. 

Updated Date - 2022-01-24T06:03:16+05:30 IST