అక్రమ నిర్మాణాల తొలగింపు

ABN , First Publish Date - 2022-02-20T04:12:58+05:30 IST

శ్రీరాంపూర్‌ ఓసీపీ పరిధిలో ఇందారం గ్రామ శివా రులో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను శనివారం గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు. శ్రీరాంపూర్‌ ఓసీపీ పరిధిలో నష్టపరిహారం కోసం అక్రమంగా కట్టడాలను నిర్మిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల కథనం ప్రచురితమైంది.

అక్రమ నిర్మాణాల తొలగింపు
శ్రీరాంపూర్‌ ఓసీపీ పరిధిలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్న పంచాయతీ సిబ్బంది

జైపూర్‌, ఫిబ్రవరి 19: శ్రీరాంపూర్‌ ఓసీపీ పరిధిలో ఇందారం గ్రామ శివా రులో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను శనివారం గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు. శ్రీరాంపూర్‌ ఓసీపీ పరిధిలో నష్టపరిహారం కోసం అక్రమంగా కట్టడాలను నిర్మిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో  ఇటీవల కథనం ప్రచురితమైంది. కలెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అక్రమ కట్టడాలను పరిశీలించారు. అధికారుల ఆదేశాల మేరకు నిర్మా ణాలను తొలగిస్తున్నామని కార్యదర్శి సుమన్‌ పేర్కొన్నారు. దళారుల మాటలు నమ్మి అక్రమ కట్టడాలను నిర్మించవద్దని సూచించారు. అక్రమంగా నిర్మించిన 60  కట్టడాలను గుర్తించి తొలగిస్తున్నామని పేర్కొన్నారు.  

Updated Date - 2022-02-20T04:12:58+05:30 IST