Abn logo
Jul 30 2021 @ 00:52AM

రోడ్డు ఆక్రమణల తొలగింపు

ఆక్రమణలు తొలగిస్తున్న పంచాయతీ సిబ్బంది

కణేకల్లు, జూలై 29: స్థానిక దిగువగేరిలో రోడ్డును ఆక్రమించి వున్న పలు ఆక్రమ కట్టడాలను పంచాయతీ అధికారులు గురువా రం తొలగించారు. ఆంజనేయస్వా మి ఆలయం నుంచి దాదాపు రూ. 30 లక్షల వ్యయంతో ఏడు మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీ ఈవో చం ద్రశేఖర్‌ తెలిపారు. ఎనఆర్‌ఈజీ ఎ్‌స, పీఆర్‌ నిధులతో రోడ్డు ఏర్పా టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజులుగా రోడ్డుకు ఇరువైపులా కొలతలు వేసి ప్ర భుత్వ స్థలాన్ని గుర్తించామన్నారు. ఇందులో అక్రమ కట్టడాలను పంచాయతీ సిబ్బంది యంత్రాల సహాయంతో కూల్చి వేస్తున్నారు. మరికొంతమంది స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకుని రహదారి ఏర్పాటుకు సహకరిస్తున్నారు.