ఆ సర్పంచ్‌ను తొలగించండి: ఏపీ హైకోర్టు
ABN , First Publish Date - 2022-01-09T01:09:58+05:30 IST
జిల్లాలోని నంబులపూలకుంట సర్పంచ్ అంజీనమ్మను
అనంతపురం: హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసినందుకు దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆ సర్పంచ్‌కు తెలిసొచ్చింది. జిల్లాలోని నంబులపూలకుంట సర్పంచ్ అంజీనమ్మను పదవి నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు అదేశించింది. నీరు- చెట్టు నిధులు, ఉపాధి హామీ బిల్లులను లబ్ధిదారులకు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను సర్పంచ్ అంజనమ్మ బేఖాతర్ చేసింది.