రేణిగుంటలోనూ 3 కి.మీ. రెడ్‌జోన్‌

ABN , First Publish Date - 2020-04-04T09:39:17+05:30 IST

రేణిగుంట పాంచాలినగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకు రెండు భాగాలుచేసి.. రెడ్‌జోన్‌గా ప్రకటించి.. ఇంటింటి సర్వే చేస్తున్నామని జేసీ-2 చంద్రమౌళి, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు.

రేణిగుంటలోనూ 3 కి.మీ. రెడ్‌జోన్‌

రెండు భాగాలుగా విభజించి ఇంటింటి సర్వే:జేసీ-2


రేణిగుంట/తిరుపతి (ఆటోనగర్‌), ఏప్రిల్‌ 3: రేణిగుంట పాంచాలినగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకు రెండు భాగాలుచేసి.. రెడ్‌జోన్‌గా ప్రకటించి.. ఇంటింటి సర్వే చేస్తున్నామని జేసీ-2 చంద్రమౌళి, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు. రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు, పోలీసు అధికారులు, ఎంపీడీవోలు, పీహెచ్‌సీ వైద్యాధికారులతో సమీక్షించారు. మూడు కిలోమీటర్ల పరిధిలోని 5,790 నివాస గృహాలను 135 బృందాలతో సర్వేచేసి.. పారిశుధ్య పనులు చేశామన్నారు.


అలాగే ఎలమండ్యం, ఎర్రమరెడ్డిపాళెం, తూకివాకం, గురవరాజుపల్లె, రామకృష్ణాపురం గ్రామాల్లోనూ పారిశుధ్య కార్యక్రమాలు, ఇంటింటి సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు విజయసింహారెడ్డి, రంగస్వామి, జరీనాబేగం, ఎంపీడీవోలు హరిబాబురెడ్డి, డీవీభాగ్యలక్ష్మి, డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ అంజూయాదవ్‌, ఎనిమిది మంది డాక్టర్లు పాల్గొన్నారు. ఫ ఇదిలా ఉంటే.. బుగ్గవీధిలో ఓ వ్యక్తి సర్వేకి సహకరించక పోవడంతో ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. వెంటనే తహసీల్దార్‌ విజయసింహారెడ్డి పోలీసుల సహకారంతో ఆ వ్యక్తి గృహానికెళ్లారు. ఆ తర్వాత అతడిని వైద్యపరీక్షల నిమిత్తం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-04-04T09:39:17+05:30 IST