బడిగంట మోగింది

ABN , First Publish Date - 2022-06-14T05:12:44+05:30 IST

వేసవి సెలవులు ముగి శాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం అన్ని పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి.

బడిగంట మోగింది
ఉత్తనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చేరుతున్న విద్యార్థులు

- జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం

- విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

గద్వాల టౌన్‌, జూన్‌ 13 :  వేసవి సెలవులు ముగి శాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం అన్ని పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొన్ని పాఠశా లల్లో విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పా టు చేశారు. ధరూరు మండలం రేవులపల్లిలో ప్రైవేటు బడులకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లో చేరగా వారికి ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. అన్ని పాఠశాలల్లో  తొలిరోజే మధ్యాహ్న భోజనాన్ని అందించారు. తొలి రోజు విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉందని, 40 శాతం దాటలేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 


కొవిడ్‌ నిబంధనలు పాటించాలి 

వడ్డేపల్లి : విద్యార్థులందరూ కొవిడ్‌ నిబంధనలు పా టించాలని  వడ్డేపల్లి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణసూరి సూచించారు. మునిసిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌ ప్రభుత్వ పాఠశాలలను సోమవారం ఆమె పరిశీలించారు. విద్యార్థులు చైర్‌పర్సన్‌కు పుష్చగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ప్రతీ ఒక్కరూ మాస్కులుఽ దరించి, శానిటైజర్‌ వినియోగించాలని చెప్పారు. 


పాఠశాలల పరిశీలన

వడ్డేపల్లి : మండల పరిధిలోని జిల్లేడుదిన్నె, రామా పురం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా పరిషత్‌ ఉప ముఖ్యకార్యనిర్వాహణ అధికారి ముసాయిదా బేగం సోమవారం పరిశీలించారు. జిల్లేడుదిన్నె పాఠశాల విద్యా ర్థులు ఆమెకు పూలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లోని సెగ్రిగేషన్‌ షెడ్‌, నర్సరీలను పరిశీలించారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమంలో భా గంగా రామాపురంలో పాత ఇళ్ల కూల్చివేతను పరిశీలిం చారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.


ఆంగ్లంపై ఆసక్తి చూపుతున్నారు

అయిజ : ఆంగ్లంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని ఉత్తనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్మారెడ్డి అన్నారు. పాఠశాలల ప్రారంభం మొదటి రోజు సోమవారం వివిధ పాఠశాలల నుంచి 50 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం లో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏబేలు, లక్ష్మీరెడ్డి, శ్యామ్‌సన్‌, వీరన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సర్వేశ్వరాచారి పాల్గొన్నారు.


పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన

అయిజ : పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించారు. వివరించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఉద్యోగి రామాంజనేయులు, ప్రధానో పాధ్యాయుడు జగపతిరెడ్డి, ఏఎన్‌ఎం వజ్రలీల, లలిత, సునిత, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-14T05:12:44+05:30 IST