Abn logo
Oct 26 2021 @ 23:29PM

బయోమెట్రిక్‌ మిషన్లను రిపేరు చేయించండి

ఎంఈవోకు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 26: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ఆదేశించినందున  మున్సిపల్‌ పాఠశాలలోని బయోమెట్రిక్‌ మిషన్లను రిపేరు చేయించాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి డీవీ రవీంద్రుడు ఎంఈఓ సావిత్రమ్మను కోరారు. ఆ మేరకు మంగళవారం ఎంఈవోకు విన తి పత్రం అందజేశారు. మున్సిపల్‌ పా ఠశాలల్లో బయోమెట్రి క్‌ మిషన్లు పనిచేయడం లేదన్నారు. అమ్మవొడికి 75 శాతం హాజరు ఉండాలని ఆదేశించారని అయితే విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తున్నందున వారికి 75 శాతం హాజరు ఎలా వస్తుందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు నాగేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌, ప్రధానోపాధ్యాయులు  పాల్గొన్నారు.