ఆర్థిక సంఘం నిధులతో బడుల మరమ్మతులు

ABN , First Publish Date - 2021-10-15T07:09:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 14వ, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగ పరిధిని మరింత విస్తరిస్తూ కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఆర్థిక సంఘం నిధులతో బడుల మరమ్మతులు

14, 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల సవరణ

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 14వ, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగ పరిధిని మరింత విస్తరిస్తూ కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, హెల్త్‌ సబ్‌సెంటర్లు, విత్తనాలు, ఎరువులు విక్రయించే సహకార సంఘాల స్టోర్లు తదితర భవనాల మరమ్మతులకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉన్న 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులతో భవనాల నిర్వహణతో పాటు ప్రాధాన్యతను బట్టి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించుకోవాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ, కేంద్ర పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆదేశాలిచ్చాయి. 

Updated Date - 2021-10-15T07:09:20+05:30 IST