Abn logo
Sep 27 2021 @ 00:04AM

రెండేళ్లకే మరమ్మతులు

పిల్లర్ల మధ్య స్లాబ్‌లోకి నీరు వెళ్లకుండా అడ్డుగా పెట్టిన రేకులు

శిథిలావస్థలో రైల్వే స్టేషన భవనం

కూలిపోయిన పీఓపీ 


గుంతకల్లు, సెప్టెంబరు 26: అట్టహాసంగా నిర్మించిన రైల్వే స్టేషన నూతన భవనం రెండేళ్లకే మరమ్మతులు చేయాల్సిన దుస్థితికి చేరుకుంది. గుంతకల్లులో ఎయిర్‌ పోర్టు తరహాలో నూతన రైల్వే స్టేషన భవనాన్ని ని ర్మించారు. 2013లో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా, దాదాపుగా రూ.10 కోట్లతో రెండు విడతలుగా నిధులు మంజూరుచేసి రెండుసార్లు ప్లా న్లను మార్చి నిర్మించారు. డీఆర్‌ఎం విజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ హయాంలో ఈ రైల్వే స్టేషన నూతన భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. రెండున్నరేళ్ల కిందట ఇంకా పనులు పూర్తికాకమునుపే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఓ వైపు పనులు జరగుతుండగానే ఈ స్టేషన భవనాన్ని లాంఛనం గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పనులన్నీ పూర్తయినా కేవలం రెండేళ్ల కే ఈ భవనం స్లాబు వర్షాలకు దెబ్బతింది. నాణ్యతా రాహిత్యం కారణంగా మరమ్మతులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. స్లాబుపైన వేసిన సి మెంటు ప్లాస్టింగ్‌ దెబ్బతింది. దీంతో కనీసం యాబై, అరబై ఏళ్లు భద్రంగా ఉండాల్సిన స్లాబ్‌ వర్షాలకు కారడం ప్రారంభించింది. ఈ కారణంగా టీటీఈల కార్యాలయంలో వేసిన ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ డిజైన కుప్పకూలింది. ఏ సీల నిర్వహణకు గానూ ఈ పీఓపీ లేయర్‌ను నిర్మించారు. దీని వల్ల ఎ యిర్‌ కండిషనర్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది.


పీఓపీ లేకుంటే ఏసీలపై అదనపు భారం పడి అధిక కరెంటు ఖర్చవుతుంది. కాగా వర్షాల కారణం గా స్లాబుపై నీరు నిలుస్తుండటంతో నెమ్ము కారణంగా పీఓపీ ఫిటింగులు ఊడిపోయి కూలిపోయింది. దీంతో దాన్ని తొలగించివేశారు. రూ.లక్షలు ఖ ర్చుచేసి వేసిన పీఓపీ రెండంటే రెండేళ్లలోనే తొలగించాల్సి వచ్చింది. అలాగే స్లాబ్‌పై మరమ్మతు పనులను చేపట్టారు. ఈ భవన నిర్మాణం జరుగుతు న్న సందర్భంలోనే దీని నాణ్యతా ప్రమాణాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించింది. వాటిని నిజం చేస్తూ భవనం నిర్వహణ కొరవడిన కారణంగా స్లాబ్‌ దెబ్బతింది.