నులకజోడు రహదారికి మరమ్మతులు

ABN , First Publish Date - 2021-09-17T05:02:57+05:30 IST

వరదకు కొట్టుకుపోయిన నులకజోడు రహదారికి అధికారులు గురువా రం మరమ్మతులు చేశారు.

నులకజోడు రహదారికి మరమ్మతులు
యంత్రంతో మట్టిని చదును చేస్తున్న దృశ్యం


భామిని: వరదకు కొట్టుకుపోయిన నులకజోడు రహదారికి అధికారులు గురువా రం మరమ్మతులు చేశారు. నులకజోడు నుంచి అలికాం-బత్తిలి ఏబీ రోడ్డుకు అను సంధానంగా వరద కాలువ మీదుగా వేసిన రహదారి ఇటీవల కూలిపోయిన విష యం విదితమే. దీనికి వంశధార అధికారులు కల్వర్టు పైపులు తొలగించి మట్టి, కంకర వేసి చదును చేశారు.  రాకపోకలకు   ఇబ్బందులు లేకుండా వంశధార అధికా రుల ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్టు  డీఈ భవానీ శంకర్‌  తెలిపారు. అయితే పూడుకు పోయిన కల్వర్టు వంశధార పనులకు సంబంధం లేదని చెప్పారు. పంచా యతీరాజ్‌ నిర్మించి న రహదారిలో కల్వర్టు ఉందని తాత్కాలికంగా మట్టి వేసి నిర్మిం చామని,   రెండు మూడురోజుల్లో పైపులు వేసి కల్వర్టును నిర్మిస్తామని తెలిపారు.  వరద కాలువ గట్టులో  నీరు మళ్లింపునకు వంతెన నిర్మాణానికి  డిజైన్‌కు ఆమోదం లభించిందని చెప్పారు. డిసెంబర్‌, జనవరిల్లో ఆ పను లు చేపడతామని డీఈ తెలిపారు. తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో సర్పంచ్‌ ప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు. 



 

Updated Date - 2021-09-17T05:02:57+05:30 IST