Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

17 తాలూకాల్లో జేఏసీ సమావేశాలు నిర్వహించి ఆందోళనలు 

నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన

ఏపీఎన్జీఓల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు 6: ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మికులు మంగళవారం నుంచి ఉద్య మానికి సన్నద్ధం కావాలని ఏపీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల మాధవ పిలుపునిచ్చారు. సోమవారం ఎన్జీఓ హోంలో ఉద్యమ కార్యచరణపై అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్‌, కార్మిక సంఘాలతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కుల మాధవ మాట్లాడుతూ రెండ్రోజుల డెడ్‌లైన విధించినా ప్రభుత్వం నుంచి ఎటు వంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర జేఏసీల పిలుపు మేరకు ఉద్యమబాట పట్టాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు తమ తమ కార్యాలయాల్లో 10వ తేదీ వరకూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్నారు. 13వ తేదీన మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమా లు చేపట్టాలన్నారు. 16వ తేదీ అన్ని తాలూకాల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలన్నారు. 21న కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 17 తాలూకాల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మికులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి, నాయకులు రవికుమార్‌, లక్ష్మన్న, యుఎస్‌ నాయకులు లక్ష్మీనారాయణ, రామ్మోహన, వేణుగోపాల్‌ రెడ్డి, అక్కులప్ప, నరసింహులు, మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన శర్మ, ఫార్మాసిస్టు సంఘం నాయకులు హరి, శ్రీధర్‌, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం:

ఏపీఎన్జీఓల సంఘం నగర కార్యదర్శి మనోహర్‌రెడ్డి

నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి హక్కులను సాధించుకుందామని ఏపీఎన్జీఓల సంఘం నగర కార్యదర్శి మనోహర్‌రెడ్డి సోమవారం  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో మంగళవారం నుంచి 10వ తేదీ వరకూ నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తూనే నిరసన తెలపాలన్నారు. అనంతరం భోజన విరామ సమయంలో సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు, డీఏల విడుదల ఇతర అలవెన్సులపై నిరసన తెలపాలన్నారు. అన్ని తాలూకా ల్లోని ఉద్యోగులందరూ విధులు నిర్వహిస్తూనే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement