ఆడిట్‌ శాఖకు ప్రత్యుత్తరాలు సమర్పించాలి

ABN , First Publish Date - 2022-01-20T05:17:21+05:30 IST

జిల్లాలో వివిధ శాఖల వారీగా 2014-15 నుంచి 2020-21 వరకు ఉన్న ఆడిట్‌ అభ్యంతరాలపై రాష్ట్ర ఆడిట్‌ శాఖకు ప్రత్యుత్తరాలను సమర్పించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

ఆడిట్‌ శాఖకు ప్రత్యుత్తరాలు సమర్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, హాజరైన అధికారులు

- వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

- ప్రతీ ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి 

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, జనవరి 19 : జిల్లాలో వివిధ శాఖల వారీగా 2014-15 నుంచి 2020-21 వరకు ఉన్న ఆడిట్‌ అభ్యంతరాలపై రాష్ట్ర ఆడిట్‌ శాఖకు ప్రత్యుత్తరాలను సమర్పించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి కోఆర్డినేషన్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. 2014-15 నుంచి 2020-21 వరకు రాష్ట్ర ఆడిట్‌శాఖ ఇచ్చిన రిపోర్టులో జిల్లాకు సంబంధించి 34,197 అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా పరిషత్‌లో 23, మండల ప్రజా పరిషత్‌లలో 1,050, గ్రామ పంచాయితీల్లో 31,927, జిల్లా గ్రంథాలయ సంస్థలో 44, అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీలో 154, నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద 75, నాలుగు మునిసి పాలిటీల పరిధిలో 904 అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటికి త్వరితగతిన తగిన ఆధారాలతో ప్రత్యుత్తరాలను రాష్ట్ర ఆడిట్‌శాఖకు పంపించాలని ఆదేశించారు. శాఖల వారీగా ఉన్న అభ్యంతరాలను రెండు వారాల్లోగా రాష్ట్ర ఆడిట్‌శాఖకు సమర్పించాలని చెప్పారు. ఏ సమస్య వచ్చినా ఆడిట్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని ఆధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీల వారీగా అభ్యంతరాల వివరాలపై సమీక్షించారు. అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు వారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీ వోలు, ఎంపీవోలతో సమీక్షించారు. టీనేజర్లకు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. విద్యా సంస్థలకు సెలవులు ఉన్నందున పిల్లలందరు ఇళ్లలో ఉంటారని, ఆశా, ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్‌ వేయాలన్నారు. రెండవ డోసు వ్యాక్సినేషన్‌ కూడా 100 శాతం పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఒమైక్రాన్‌, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతీ ఒక్కరు మాస్కు ధరించి భౌతికదూరం పాటించేలా చూడాలని అఽధికారులకు సూచించారు. మార్కెట్లో ప్రజలు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. జిల్లాలో అన్ని మునిసిపాలిటీల పరిధిలో, గ్రామ స్థాయిలో శాటినే షన్‌ చేయించాలని మునిసిపల్‌ అధికారులను ఆదే శించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు తప్పని సరిగా పరీక్ష చేయించుకోవాలన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్లు అందరికీ బూస్టర్‌ డోస్‌ వేయించాలని, రెండవ డోస్‌ తీసుకొని ఆరు నెలలు దాటిన వారందరూ తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ తీసుకునేలా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - 2022-01-20T05:17:21+05:30 IST