కొల్లేరుపై నివేదిక అందజేయాలి

ABN , First Publish Date - 2020-09-20T09:32:32+05:30 IST

కొల్లేరు స్థితిగతులపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి త్వరితగతిన అందజేయాలని గుడివాడ ఆర్డీవో శ్రీను కుమార్‌ ఆదేశించారు. శనివారం కైకలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో కొల్లేరు పరిరక్షణపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

కొల్లేరుపై నివేదిక అందజేయాలి

అధికారులకు ఆర్డీవో శ్రీనుకుమార్‌ ఆదేశం

కైకలూరు,సెప్టెంబరు19: కొల్లేరు స్థితిగతులపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి త్వరితగతిన అందజేయాలని గుడివాడ ఆర్డీవో శ్రీను కుమార్‌ ఆదేశించారు. శనివారం కైకలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో కొల్లేరు పరిరక్షణపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2006వ సంవత్సరంలో కొల్లేరు ఆపరేషన్‌ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సరస్సు స్థితిగతులు, పరిరక్షణకు తీసుకున్న చర్యలపై నివేదికను తయారు చేయాలని అటవీశాఖ, రెవెన్యూ, డ్రైనేజీ, పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు, మత్స్యశాఖ అధికారులకు సూచించారు.


2016వ సంవత్సరంలో గుడ్లవల్లేరు గ్రామానికి చెంది జి.చంద్రశేఖర్‌  కొల్లేరు కాంటూరు కుదింపు, ఆక్రమణలపై నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు కొల్లేరు పర్యాటక కేంద్రం, డ్రెయిన్లు వంటి వాటిపై పరిరక్షణ చర్యలు ఏ మేరకు తీసుకున్నారో  పూర్తిస్థాయిలో నివేదికను తయారుచేసి అందచేయాలని చెప్పారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో తయారు చేసిన నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందచేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కన్జర్వేటర్‌ ఫారెస్టు అధికారి శివకుమార్‌, కైకలూరు ఇన్‌చార్జి రేంజర్‌ భవానీ, తహసీల్దార్‌ కృష్ణకుమారి, ఇరిగేషన్‌ డీఈ గణపతి, డ్రెయినేజ్‌ డీఈ శీరిష పాల్గొన్నారు.

Updated Date - 2020-09-20T09:32:32+05:30 IST