నివేదికలు తయారు చేయాలి

ABN , First Publish Date - 2022-01-17T05:06:16+05:30 IST

అకాల వర్షానికి జరిగిన పంట నష్టంపై వ్యవసాయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తయారు చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు.

నివేదికలు తయారు చేయాలి
మంగపేటలో మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి
కాల్వ శ్రీరాంపూర్‌, జనవరి 16: అకాల వర్షానికి జరిగిన పంట నష్టంపై వ్యవసాయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తయారు చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానతో నేలకొరిగిన మొక్కజొన్న, మిర్చి, పసుపు పంటలను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి శనివారం స్థానిక ప్రజాప్రతినిఽధులు, వ్యవసాయ అధికారులతో కలిసి వారు పరిశీలించారు. పంట నష్టపోయిన వారి వివరాలు సేకరించి నివేదికలు తాయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కురిసిన వడగళ్ల వర్షం వల్ల మొక్కజొన్న, మిర్చి, పసుపు, పత్తి మొదలగు పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 500 వందల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. రైతులు ఆరుగాలం పండించిన పంట అకాల వర్షాలతో నష్టపోయి రైతాంగం పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టంపై నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి అంజేయాలన్నారు. రైతాంగానికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్‌, జెడ్‌పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, సింగిల్విండో ఛైర్మన్‌లు చదువు రామచంద్ర రెడ్డి, గజవెళ్లి పురుషోత్తం నాయకులు ఓదెల రవి, బుర్ర సదానందం, అడెపు రాజు, కొల్లూరి రాయమల్లు, సుముఖం మల్లారెడ్డి, కుదురు సతీష్‌, మండల వ్యవసాయాధికారి నాగార్జున, నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-17T05:06:16+05:30 IST