కేరళలో కరోనా కలవరం: దేశంలో తొలగని సెకెండ్ వేవ్ ముప్పు!

ABN , First Publish Date - 2021-08-04T11:46:41+05:30 IST

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ బలహీనపడిందని...

కేరళలో కరోనా కలవరం: దేశంలో తొలగని సెకెండ్ వేవ్ ముప్పు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ బలహీనపడిందని, మున్ముందు థర్డ్ వేవ్ రానున్నదనే చర్చలు నడుస్తున్నాయి. థర్డ్ వేవ్‌ ఎప్పుడు వస్తుందనే దానిపై రిపోర్టులు కూడా వెలువడ్డాయి. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశం ఇంకా కరోనా సెకెండ్ వేవ్ బారి నుంచి బయటపడలేదు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో నెలకొన్న ఆర్ వాల్యూ గురించి ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కరోనా బాధితుని నుంచి ఎంతమందికి కరోనా సోకుతుందో దానినే ఆర్ వాల్యూ అంటారు. 


ప్రస్తుతం తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ అధికంగా ఉంది. అలాగే దేశంలోని 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉంది. వాటిలో కేరళలోని 10 జిల్లాలు ఉన్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భారత్ విషయానికొస్తే, ఇంకా కరోనా సెకెండ్ వేవ్ పూర్తిగా తొలగిపోలేదన్నారు.

Updated Date - 2021-08-04T11:46:41+05:30 IST