కొవిడ్‌ నిబంధనల మేరకే రిపబ్లిక్‌ డే

ABN , First Publish Date - 2022-01-22T06:22:09+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే గణతంత్ర దినోత్సవాన్ని నిర్వ హించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు.

కొవిడ్‌ నిబంధనల మేరకే రిపబ్లిక్‌ డే
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి 

అనంతపురం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే గణతంత్ర దినోత్సవాన్ని నిర్వ హించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఆమె జిల్లా ఎస్పీ ఫక్కీరప్పతో కలిసి కలెక్టరేట్‌ లోని రెవెన్యూభవనలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... కొవిడ్‌, ఒమైక్రాన పట్ల అప్రమత్తంగా ఉంటూ అందుకు తగినవిధంగా గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయాలన్నా రు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కొవిడ్‌ నిబంధనలు, అనుస రించాల్సిన జాగ్రత్తలపై ప్రచార బోర్డులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు. మాస్కు లేనిదే ఏ ఒక్కరిని అనుమతించొద్దన్నారు. మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసే సాయుధ దళాలు, పోలీసు బందోబస్తును కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల న్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా ఉండాలని ఆదేశించారు. ఈ శకటాల సంఖ్య 10-12 మా త్రమే ఉండాలన్నారు. ఆయా శాఖల్లో ఉత్తమ పనితీరు, ట్రాక్‌ రికార్డుకనబరిచిన ఉద్యోగులను మాత్రమే ఆయా శాఖల అధికారులు శనివారంలోపు డీఆర్‌ఓ కార్యాలయా నికి అవార్డుల కోసం ప్రతిపాదించాలన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీ, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును తెలిపే స్టాల్స్‌ను ఆకర్షణీయంగా ఏర్పా టు చేయాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సం బం ధించిన 2 స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాలవెల్లువ, సీఈఓ, డ్వామా, పంచా యతీరాజ్‌ శాఖ, ఆ రోగ్యం, విద్యకు సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. మత్స్యశాఖ, పట్టుపరిశ్రమ, చేనేతశాఖ, ఐసీడీఎస్‌, ఎస్సీ,బీసీ,ఎస్టీ కార్పొరేషన సంబం ధించిన రెండు స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 24వ తేదీలోపు అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జేసీలు నిశాంతకుమార్‌, గంగాదర్‌ గౌడ్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నవీన, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఓటీఎ్‌సను త్వరితగతినపూర్తి చేయండి : కలెక్టర్‌

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద ఓటీఎస్‌ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి జేసీ సిరితో కలిసి జిల్లా, మండలస్థాయి అధికారులతో ఓటీఎస్‌, కొవిడ్‌ వ్యాక్సినేషనపై టెలీకాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... ఓటీఎ్‌సకు సంబంధించి లక్షమంది లబ్ధిదారుల సర్వే పెండింగ్‌లో ఉందనీ, నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో పెండింగ్‌ ఉన్న రెండో డోస్‌ వ్యాక్సిన ప్రణాళిక ప్రకారం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 60 ఏళ్లు దాటిన వారు, ఫ్రంట్‌లైన, హెల్త్‌కేర్‌ వర్కర్లకు బూస్టర్‌ డోస్‌ వేయాలన్నారు. ఆదివారం కూడా లక్ష డోస్‌ల వ్యాక్సిన వేసేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - 2022-01-22T06:22:09+05:30 IST