సంక్షేమమే మా బాట

ABN , First Publish Date - 2022-01-27T06:22:42+05:30 IST

‘జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేలా చూస్తున్నాం. అందరికీ సంతృ ప్తికర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోంది. పోలవరాన్ని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసేందుకు కృత నిశ్చయంతో ఉంది.

సంక్షేమమే మా బాట

రిపబ్లిక్‌ డే వేడుకల్లో కలెక్టర్‌ కార్తికేయ 

పోలవరం పూర్తి చేస్తాం.. వాటర్‌ గ్రిడ్‌కు రూ.3,670 కోట్లు 

కాల్వల ఆధునికీకరణకు రూ.51 కోట్లు 

నెలాఖరుకు పేదలకు ఆరు వేల టిడ్కో ఇళ్లు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :

‘జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేలా చూస్తున్నాం. అందరికీ సంతృ ప్తికర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోంది. పోలవరాన్ని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసేందుకు కృత నిశ్చయంతో ఉంది. ఈ నెలాఖరు నాటికి టిడ్కో ఇళ్లు కొన్నింటిని పేదలకు అందజేస్తాం’ అని భారత గణతంత్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. గత ఏడాది జూన్‌ నుంచి గోదావరి నీటిని అప్రోచ్‌ చానల్‌ నుంచి స్పిల్‌ వేకు మళ్ళించాం. ఇప్పటికే 48 రేడియల్‌ గేట్లకు 42 అమర్చారు. త్వరలోనే మిగిలిన వాటి పనులు పూర్తవుతా యి. పవర్‌ హౌస్‌ పునాదుల తవ్వకం పనులు మార్చి నాటికి పూర్తి కానుందని చెప్పారు. అప్పర్‌ కాపర్‌ డ్యాం పనులు పూర్తయ్యాయని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్‌ అండ్‌ఆర్‌ కింద జిల్లాలో 34 వేల 641 కుటుంబాలకు ఇంత వరకు రెండు వేల 504 కుటుంబాలకు పునరావాసం కల్పించి నట్టు వెల్ల డించారు. జిల్లాలో రబీ పంటకు సాగు నీరందిం చేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. కాలువలు మూసివేసిన తరు వాత డెల్టా ఆధునికీకరణ పనులు రూ.50 కోట్లతో చేపట్ట డమే కాకుండా తూడు తొలగింపుకు మరో రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. వ్యవసాయంలో రైతులకు సాధ్యమైనంత మేర ఎలాంటి లోటుపాట్లు రాకుం డా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఈ ఖరీఫ్‌లో 13.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని వెల్లడిం చారు. పీఎం కిసాన్‌ పథకం ద్వారా పెట్టుబడి సాయంగా రూ.431 కోట్లు, రైతుభరోసా కేంద్రాల ద్వారా 7.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.715 కోట్లు చెల్లించామని చెప్పారు. పంట నష్టం కింద 2020–21లో రూ.81 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేశామన్నారు.

 వాటర్‌ గ్రిడ్‌కు రూ.3,670 కోట్లు

గ్రామీణ నీటి సరఫరా ద్వారా జిల్లాలోని రెండు వేల 342 ఆవాసాల్లో ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా రోజుకు తల ఒక్కింటికి 100 లీటర్ల మంచినీటిని సరఫరా చేసేందు కు ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల నుంచి గ్రిడ్‌ లైన్ల ద్వారా వాటర్‌ గ్రిడ్‌ ఏర్పా టుకు మూడు వేల 670 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. జల జీవన్‌ మిషన్‌ కింద రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు తొమ్మిది చోట్ల భూసేకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇటీవలే ఏలూరు, శనివారపుపేటలలో 35 ఎకరాల్లో అభివృద్ధి చేసిన 386 ఫ్లాట్‌లకు బుకింగ్‌ ప్రారంభమైనట్టు ప్రకటించారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఇప్పటివరకు రూ.918 కోట్ల విలువైన 197 రహదారుల పనుల ను మంజూరు చేశామన్నారు. నాడు–నేడు కింద జిల్లాలో రెండో విడతగా 900 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధం చేశామన్నారు. కాపునేస్తం కింద 53వేల మంది మహిళలకు రూ.80 కోట్లు అందించగా, విద్యా దీవెన ద్వారా 154 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ.74 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేసినట్టు చెప్పారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కింద జిల్లాలో రూ.126 కోట్లు అందిస్తున్నా మని, మహిళా సంఘాలకు రూ.1,620 కోట్లు రుణాలను అందించామన్నారు. జిల్లావ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాకు సంబంధించి 45 కేసులు నమోదు చేసి 189 మందిని అరెస్టు చేసి 8 కోట్ల 76 లక్షలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్‌ చెప్పారు. జిల్లా ప్రజలకు సత్వర న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్న న్యాయమూర్తులకు ప్రత్యేక అభినం దనలు తెలియచేస్తున్నామన్నారు. 

ఉత్తములకు అవార్డులు

ఏలూరు సిటీ, జనవరి 26 : జిల్లాలో ఉత్తమ పనితీరును ప్రదర్శించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పంచాయతీరాజ్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలకు కలెక్టర్‌ కార్తికేయమిశ్రా గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ సారి రోలింగ్‌ షీల్డ్స్‌ను అందజేశారు. శనివారపుపేట, అత్తిలి వార్డు, గ్రామ సచివాలయాలకు షీల్డ్స్‌ను అందజేశారు. ఏలూరు ఆర్డీవో పనబాక రచన, కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాఽథ్‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావులకు ఉత్తమ అధికారుల అవార్డులను అందజేశారు. పోలీస్‌ కవాతులో ఉత్తమ ప్రదర్శన చేసిన స్కాట్‌లాండ్‌ బాక్‌ పైపర్‌ బృందానికి బహుమతిని అందజేశారు. జిల్లా జడ్జి ఐ.భీమారావు, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి, ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, జేసీలు బీఆర్‌ అంబేడ్కర్‌, హిమాన్షుశుక్లా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌వో డేవిడ్‌ రాజు అధికారులు పాల్గొన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన 156 మంది పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంసా పత్రాలను అందజేశారు.

రెవెన్యూ శాఖ : కలెక్టరేట్‌ : రమాదేవి, నయోమి, రేణుక, వాణి, ప్రవీణ్‌, పీహెచ్‌వీఎన్‌ఎస్‌ పవన్‌ కుమార్‌, ఏలూరు డివిజన్‌ : జీవీవీ సత్యనారాయణ, వైకేవీ అప్పారావు, ఎన్‌.విజయరాజు, పి.అజయ్‌, జి.వెంకటేశ్వరరావు. డి.కరుణ స్రవంతి, వై. సహదేవరాజు, యు.సుధీర్‌. కొవ్వూరు డివిజన్‌: ఎస్‌.శాంతి, డి.శ్రీనివాసరావు, ఐ.భవాని, ఎం.రవితేజ, కేవీవీ రామకృష్ణ. నరసాపురం డివిజన్‌ : ఎ.వామనరావు, ఈ.నాగార్జున, పి.శిరీష, బి.సురేఖ. టీవీ అప్పలాచార్యులు, కె.సూర్యనారాయణ, వి.సుధాకర్‌. 

పోలీస్‌ శాఖ : వి.విజయప్రభ, ఎన్‌.సాల్మన్‌రాజు, సీహెచ్‌ మోహన రావు, ఎం.సుబ్బారావు, కేవీఎస్‌వీ ప్రసాద్‌, పి.రవీంద్రబాబు, పి.సంగీత రావు, టి.పాపారావు, ఎం.అనిల్‌కుమార్‌, పీఎస్‌ సూర్యనారాయణ, ఎస్‌.భాను, ఎన్‌.బాలకృష్ణ, బి.నాగేశ్వరరావు, వి.రాము, ఎస్‌.మహేశ్వరి., ఎక్సైజ్‌ శాఖ :  జి.మురళీమోహనరావు, ప్రదీప్‌కుమార్‌, జి.శ్రీకాంత్‌, సెబ్‌ : ఎస్‌.సాయి స్వరూప్‌, జె.శ్రీనివాసబాలాజీ, కె.వెంకటేశ్వరరావు, బి.నాగేంద్రబాబు. డీఎఫ్‌వో(ఫైర్‌) : పీఎస్‌ నాయుడు, జె.గంగాకోటేశ్వరరావు, జీవీ రామారావు, జిల్లా సబ్‌ జైల్‌ : దుర్గారమేష్‌. జిల్లా జైల్‌ : కె.వెంకటరెడ్డి.

డీఎంహెచ్‌వో : జీఆర్‌ఎల్‌ నరసింహారావు, కె.చిన శంకర్‌కుమార్‌, డి.విద్యావతి, ఐ.పావని, కేబీకెఎస్‌ రమేష్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ : కె.నాగజ్యోతి, కె.అనంతలక్ష్మి, ఎం.ఆదాం, పి.నిర్మల, కె.మధులత, జి.అనిత, జిల్లా ఆరోగ్యశ్రీ :  బి.సూర్యప్రసాద్‌, పి.జ్యోతిశ్రీ, 108 సిబ్బంది : జె.జగదీష్‌, కె.విల్సన్‌రాజు, 104 సిబ్బంది : డాక్టర్‌ వై.నామగిరి, షేక్‌ సల్మాన్‌ఖాన్‌.

అగ్రికల్చరల్‌ అండ్‌ మార్కెటింగ్‌ : యు.రాంబాబు, పశుసంవర్ధక శాఖ : డాక్టర్‌ ఎల్‌.ఫణికుమార్‌, ఏపీఈపీడీసీఎల్‌ : పి.సాంబయ్య, కోటం ప్రకాష్‌, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ : బి.రాజారావు, బి.పూర్ణచంద్రరావు, 

ఆడిట్‌ శాఖ : జి.సుబ్బారెడ్డి, జి.వరప్రసాద్‌, ఎం.శైలజ, ఛీప్‌ ప్లానింగ్‌ కార్యాలయం : పి.రాము, కమర్షియల్‌ టాక్స్‌ : పి.శ్రీనివాసబాబు, జిల్లా సహకార బ్యాంక్‌ : ఉద్దగిరి శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ : డి.సుబ్బా రావు, ఎస్‌.బుచ్చియ్య, సీహెచ్‌ నరేష్‌, కె.సుబ్బరాజు, బొంతు శ్రీనివాసరావు

జిల్లా పంచాయతీ కార్యాలయం : షేక్‌ షంసుద్దీన్‌, ఏవీఎన్‌ సుబ్బరాయన్‌, డీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ : ఎం.రమేష్‌బాబు

జిల్లా పౌరసరఫరాల సంస్థ :  వి.దుర్గారావు, వై.శేఖర్‌బాబు, డీఆర్‌డీఏ : పి.సతీష్‌కుమార్‌, వై.లక్ష్మి, డ్వామా : ఆశీర్వాదం, ఎం.స్వర్ణకుమారి, కె.ప్రవీణ్‌కుమార్‌, కె.రాజ్యలక్ష్మి, ఇన్ఫర్మేషన్‌ డీఈఈ : ఎస్‌.గంగేశ్వరరావు

జిల్లా గృహనిర్మాణ సంస్థ : యు.సోమేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, సీహెచ్‌ సాంబశివరావు, సీహెచ్‌ లక్ష్మణవెంకటకుమార్‌, మెప్మా :  ఎన్‌.రత్నాకరరావు, మున్సి పాలిటీ : అంజి కృష్ణరాజశేఖర్‌, జి.దుర్గాప్రసాద్‌, ముత్యాల లక్ష్మి, ఎస్‌.రాజశేఖర్‌, బంగారు మల్లేశ్వరరావు, యు.పండు, ఎస్‌ఎస్‌ఏ పీవో : డీయూవీ దుర్గాప్రసాద్‌.


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఏలూరు కల్చరల్‌ : ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ స్ఫూర్తిని పెంపొందిం చాయి. ప్రథమ స్థానంలో ఏలూరు శ్రీశర్వాణి స్కూలు, ద్వితీయ స్థానంలో భీమవరం వెస్ట్‌బెర్రి, తృతీయ స్థానం లో నరసాపురం స్వర్ణాంధ్ర విద్యార్థులు నిలిచా రు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న నవరత్నాలు మొదలుకొని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అలంకృత శకటాల ద్వారా ఆయా శాఖలు ప్రదర్శించాయి. వీటిలో వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న కార్య ్డక్రమాలు వివరించే శకటానికి మొదటి బహుమ తి, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రదర్శించిన శకటానికి ద్వితీయ బహుమతి, వ్య వసాయ శకటానికి తృతీయ బహుమతి లభిం చాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవ గాహనకు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. 

Updated Date - 2022-01-27T06:22:42+05:30 IST