జెండాకు వందనం

ABN , First Publish Date - 2022-01-27T06:31:45+05:30 IST

జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి డా.వీ.రాధాకృష్ణ కృపాసాగర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి న్యాయమూర్తులు, న్యాయవాదులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

జెండాకు వందనం
బేతంచెర్ల టీడీపీ కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న నాయకులు

కర్నూలు(లీగల్‌), జనవరి 26: జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి డా.వీ.రాధాకృష్ణ కృపాసాగర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి న్యాయమూర్తులు, న్యాయవాదులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ జాతీయ నేతల కృషి ఫలితంగానే మనం స్వాతంత్ర్యాన్ని పొందామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు సత్యవతి, ఎస్‌.చిన్నబాబు, సబ్‌ జడ్జీలు పీ.కేశవరెడ్డి, ఏ.పద్మ, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు డి.షర్మిళ, ఏ. భార్గవి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాసిపోగు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌కరీమ్‌లతో పాటు పలువురు జూనియర్‌, సీనియర్‌ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


 జిల్లా వినియోగదారుల ఫోరమ్‌లో న్యాయమూర్తి ఎస్‌.నజీరున్నీసా జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రసూన న్యాయ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎన్‌.శివాజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 


కర్నూలు(కలెక్టరేట్‌): బిర్లాగేటు సమీపంలో స్థానిక సంక్షేమ భవన్‌లో జేసీ శ్రీనివాసులు జాతీయ పతావావిష్కరణ చేశారు. సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ ప్రతాప్‌ సూర్యనారాయణ రెడ్డి, డిస్ర్టిక్ట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెంకటలక్ష్మమ్మ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ నాగేశ్వర్‌ రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస కుమార్‌, సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ చింతామణి పాల్గొన్నారు. 


కర్నూలు(అర్బన్‌): ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని డీసీసీ అధ్యక్షుడు ఆహమ్మద్‌ ఆలీఖాన్‌ అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నుంచి ర్యాలీగా కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు జెండాను ఎగుర వేసి వందన సమర్పణ చేశారు. మాజీ ఎమ్మెల్సీ సుఽధాకర్‌బాబు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధుయాదవ్‌, జాన్‌విల్సన్‌, బి. రాకేష్‌, బి. బ్రతుకన్న, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


 రాయలసీమ యూనివర్సిటీలో వీసీ ఎ.ఆనందరావు జెండా ఎగురవేశారు. రెక్టార్‌ సంజీవరావు, రిజిస్ట్రార్‌ మధుసూదనవర్మ, డీన్‌లు, ప్రిన్సిపాల్స్‌, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 


 డాక్డర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ బాయినేని శ్రీనివాసులు జెండాను ఎగుర వేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జెఎండీ షఫి, భోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


 కర్నూలు(న్యూసిటీ): జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ సీఈవో ఎం.వెంకటసబ్బయ్య, జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఈవో టీవీ భాస్కర్‌నాయుడు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ శివశంకర్‌, పరిపాలన అధికారులు కృష్ణారెడ్డి, ఏ. శ్రీనివాసులు, సి. రాంగోపాల్‌, కే. సరస్వతి, జితేంద్ర, శ్రీనివాసులు, సౌభాగ్యలక్ష్మి, నాల్గవ తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం నాల్గవ తరగతి ఉద్యోగులకు బట్టలు పంపిణీ చేశారు. గత సంవత్సరం జడ్పీ ఆవరణలోని పంచాయతీరాజ్‌ కార్యాలయంలో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ చనిపోయిన వెంకటరమణ సతీమణికి కారుణ్యనియామకం పీఐయూ కర్నూలు సబ్‌డివిజన్‌ కార్యాలయంలో పోస్టింగ్‌ ఆర్డర్లను జడ్పీ చైర్మన్‌, సీఈవో అందజేశారు. 


బేతంచెర్ల: తహసీల్దార్‌, ఎంపీడీవో, నగర పంచాయతీ, సబ్‌ రిజిస్ర్టార్‌ తదితర కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. 


Updated Date - 2022-01-27T06:31:45+05:30 IST