రిపబ్లిక్‌ దేశంగా బార్బడోస్‌

ABN , First Publish Date - 2021-12-01T08:18:33+05:30 IST

కరీబియన్‌ ద్వీపంలోని బార్బడోస్‌ దేశం రిపబ్లిక్‌గా అవతరించింది. బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌ను దేశాధినేత పదవి నుంచి తొలగించింది...

రిపబ్లిక్‌ దేశంగా బార్బడోస్‌

బ్రిటిష్‌ రాణి పాలన నుంచి విముక్తి

బ్రిడ్జిటౌన్‌, నవంబరు 30: కరీబియన్‌ ద్వీపంలోని బార్బడోస్‌ దేశం రిపబ్లిక్‌గా అవతరించింది. బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌ను దేశాధినేత పదవి నుంచి తొలగించింది. దీంతో 400 ఏళ్ల బ్రిటిష్‌ వలస పాలనకు బార్బడోస్‌ పూర్తిగా ముగింపు పలికినట్లైంది. 1625లో అప్పటి ఇంగ్లండ్‌ రాజు జేమ్స్‌ కాలం నుంచి బ్రిటీష్‌ వలస పాలనలో మగ్గుతున్న బార్బడోస్‌ దేశం 1966 నవంబరులో స్వాతంత్య్రం పొందింది. అనంతరం 55 ఏళ్లకు మంగళవారం రిపబ్లిక్‌ దేశంగా ప్రకటించుకుంది. ఈ సందర్భంగా సోమవారం అర్ధరాత్రి రాజధాని బ్రిడ్జిటౌన్‌లోని చాంబెర్లైన్‌ బ్రిడ్జి వద్ద సంబరాలు చేసుకున్నారు. హీరోస్‌ స్క్వేర్‌ వద్ద జాతీయ గీతాన్ని ఆలపించి 21 గన్‌ సెల్యూట్‌ నిర్వహించారు. బార్బాడియన్‌ సింగర్‌ రిహన్నాను జాతీయ హీరోగా ప్రధాని మియా మోట్లే ప్రకటించారు.

Updated Date - 2021-12-01T08:18:33+05:30 IST