అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2021-01-26T07:09:24+05:30 IST

ఈరోజు మనం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్నాం. ఏటా ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విదేశీ నేతలు హాజరయ్యేవారు.

అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు

ఈరోజు మనం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్నాం. ఏటా ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విదేశీ నేతలు హాజరయ్యేవారు. ఈసారి కరోనా మహమ్మారి మూలంగా అతిథి లేకుండానే వేడుకలు జరగనున్నాయి.


గత 50 ఏళ్లలో ముఖ్య అతిథిగా లేకుండా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం ఇదే మొదటిసారి. 1952, 1953, 1966లో జరిగిన గణతంత్రదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరూ లేరు. ఆ తరువాత క్రమంతప్పకుండా ఎవరో ఒకరు అతిథిగా వస్తున్నారు. ఇప్పుడు 2021 వేడుకలు కరోనా మూలంగా అతిథి లేకుండానే జరుగుతున్నాయి.


బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ వేడుకలకు హాజరుకావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా హాజరుకాలేనంటూ సందేశం పంపారు. 

గణతంత్రవేడుకలకు లక్షకు పైగా జనం హాజరయ్యే వారు. ఈసారి ఆ సంఖ్య పాతికవేలకు మించకుండా చూస్తున్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం కల్పించడం లేదు. 

బంగ్లాదేశ్‌ ఆర్మీకి చెందిన మిలిటరీ బ్యాండ్‌ పరేడ్‌లో పాలుపంచుకోనుంది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు అవుతున్నాయి. 

Updated Date - 2021-01-26T07:09:24+05:30 IST