అంగరంగ వైభవంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-26T16:53:32+05:30 IST

ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి....

అంగరంగ వైభవంగా గణతంత్ర వేడుకలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీలు రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్ ఏఎస్ఐ బాబురామ్ కు అశోక్ చక్ర పురస్కారాన్ని ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.రాజ్ పథ్ లో గణతంత్ర పరేడు జరిగింది. ఈ పరేడులో దేశ సైనిక సామర్థ్యాన్ని చెప్పేలా ఘనంగా సాగింది. భారత వాయుసేన విన్యాసాలు, వివిధ రాష్ట్రాల శకటాలతో పరేడ్ సాగింది.

అమర వీరులకు మోదీ నివాళులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.


 వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు.ఆజాదీ కా అమృత్ ఉత్సవం సందర్భంగా ఈ ఏడాది కవాతు నిర్వహించారు.గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రదర్శనలు చేశారు.ఇండియా గేటు వద్ద ప్రధాని నరేంద్రమోదీ నేతాజీ డిజిటల్ విగ్రహం తెరను ప్రారంభించి రిపబ్లిక్ వేడుకలను ప్రారంభించారు.దేశంలో కోసం ప్రాణాలు అర్పించిన 25,942 మంది అమర సైనికుల పేర్లను వార్ మెమోరియల్ వద్ద గ్రానైట్ పై చెక్కారు.



Updated Date - 2022-01-26T16:53:32+05:30 IST