రక్షణలో ‘ప్రైవేట్‌’ పరిశోధనకు ప్రోత్సాహకాలు

ABN , First Publish Date - 2020-11-26T08:11:20+05:30 IST

రక్షణ రంగంలో ప్రైవే ట్‌ కంపెనీల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలను ప్రోత్సహించాలి. అందుకు ప్రోత్సాహకాలను ఇవ్వాలి. పరిశోధన, అభివృద్ధిని వేగిరం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం

రక్షణలో ‘ప్రైవేట్‌’ పరిశోధనకు ప్రోత్సాహకాలు

పీపీపీ మోడల్‌లో టెస్టింగ్‌ సదుపాయాలు  

రక్షణ పరిశోధన విభాగ 

కార్యదర్శి సతీశ్‌ రెడ్డి 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రక్షణ రంగంలో ప్రైవేట్‌ కంపెనీల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలను ప్రోత్సహించాలి. అందుకు ప్రోత్సాహకాలను ఇవ్వాలి. పరిశోధన, అభివృద్ధిని వేగిరం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో టెస్టింగ్‌ సదుపాయాలను ఏర్పాటు చేయాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అన్నారు. దేశీయంగా టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశామని.. రక్షణ రం గంలో స్వావలంబన సాధించాలని ప్రభు త్వం గట్టి పట్టుదలతో ఉందని సీఐఐ, తెలంగాణ చాప్టర్‌ నిర్వహిచిన డిఫెన్స్‌ కాంక్లేవ్‌లో పేర్కొన్నారు. స్వావలంబన సాధనకు ప్రభుత్వం అనేక విధాన మార్పులు తీసుకురానుందని చెప్పారు. 


సామర్థ్యాలు పెంచుకోవాలి..

స్వావలంబన సాధనకు డిజైన్‌, డెవల్‌పమెంట్‌, టెస్టిం గ్‌ సామర్థ్యాలను పెంచుకోవాలని సతీష్‌ రెడ్డి అన్నారు.  అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నారు. క్షిపణులు, టార్పెడోలు, ఎలకా్ట్రనిక్స్‌ వార్‌ఫేర్‌ వంటి వాటిలో స్వావలంబన సాధించాం. దేశంలో ప్రస్తుతం సిస్టమ్స్‌, సబ్‌ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయగలిగిన కంపెనీలు 2,000 వరకూ ఉన్నాయి. గత ఒకటి రెండు దశాబ్దాల్లో 10,000 టైర్‌ 2, టైర్‌ 3 కంపెనీలు రక్షణ రంగ వ్యవస్థలకు అవసరమైన పరికరాలను సరఫరా చేస్తున్నాయి. కీలకమైన వ్యవస్థల అభివృద్ధిలో కూడా ప్రైవేటు కంపెనీలను తీసుకురావాలన్నారు. 

Updated Date - 2020-11-26T08:11:20+05:30 IST