స్పర్శ కలిగిన కృత్రిమ చర్మం.. తయారుచేసిన సైంటిస్టులు!

ABN , First Publish Date - 2020-07-16T05:03:25+05:30 IST

స్పర్శ కలిగిన కృత్రిమ చర్మాన్ని సింగపూర్ సైంటిస్టులు తయారుచేశారు.

స్పర్శ కలిగిన కృత్రిమ చర్మం.. తయారుచేసిన సైంటిస్టులు!

సింగపూర్: స్పర్శ కలిగిన కృత్రిమ చర్మాన్ని సింగపూర్ సైంటిస్టులు తయారుచేశారు. ఇక్కడి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకులు దీన్ని సిద్ధంచేశారు. రోబోలకు బ్రెయిలీ లిపిని నేర్పడం కోసం ఈ కృత్రిమ చర్మాన్ని తయారు చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ చర్మాన్ని రోబోటిక్స్ సైన్స్ అండ్ సిస్టమ్స్ 2020లో ప్రదర్శించారు. సాధారణంగా మనుషుల నాడీ వ్యవస్థకన్నా ఈ చర్మం వెయ్యిరెట్లు వేగంగా పనిచేస్తుందట. వస్తువు ఆకారం, టెక్స్చర్, గట్టితనాన్ని కూడా రెప్పపాటుకన్నా పదిరెట్ల వేగంగా ఈ కృత్రిమ చర్మం గ్రహిస్తుందని పరిశోధకులు తెలిపారు.

Updated Date - 2020-07-16T05:03:25+05:30 IST