6 అడుగులకు మించి వైరస్‌ వ్యాప్తి

ABN , First Publish Date - 2020-08-14T06:57:51+05:30 IST

కరోనా వైరస్‌ 6 అడుగుల కంటే ఎక్కువ దూరం వ్యాపిస్తుం దట! దగ్గినప్పుడు, తుమ్మినప్పుడే, అరిచినప్పుడే కాదు, సాధారణంగా మాట్లాడినప్పుడు కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా పరిశోధకులు చెబుతున్నారు...

6 అడుగులకు మించి వైరస్‌ వ్యాప్తి

వాషింగ్టన్‌, ఆగస్టు 13: కరోనా వైరస్‌ 6 అడుగుల కంటే ఎక్కువ దూరం వ్యాపిస్తుందట! దగ్గినప్పుడు, తుమ్మినప్పుడే, అరిచినప్పుడే కాదు, సాధారణంగా మాట్లాడినప్పుడు కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా పరిశోధకులు చెబుతున్నారు. నోట్లోంచి వచ్చే తుంపరల ద్వారా కరోనా వైరస్‌ బయటకు వస్తోందని, వ్యాధి బారిన పడేయడమే కాకుండా కణాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింంటున్నారు. అందుకే 6 అడుగుల భౌతిక దూరం వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు సరిపోదన్న విషయాన్ని తమ పరిశోఽధనల్లో గుర్తించామని వారు వెల్లడించారు. దాంతో వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనే విషయాన్ని అంగీకరించాలని డబ్ల్యూహెచ్‌వోను కోరారు. 


Updated Date - 2020-08-14T06:57:51+05:30 IST