Abn logo
Sep 27 2021 @ 23:15PM

ఎర్ర కాలువ ఉధృతి

కొంగువారిగూడెం జలాశయం నుంచి నీటి ప్రవాహం

జంగారెడ్డిగూడెం: కుండపోత వర్షం, ఏజెన్సీ నుంచి ఉధృతంగా వాగుల ద్వారా ప్రవహించే వరదతో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఉదయం 9 గంటలకు భారీగా వరద పో టెత్తడంతో జలాశయ నాలుగు గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదిలారు. ఉదయం 11 గంటలకు 26,095 క్యూసెక్కులు, 12 గంటలకు 28,306 క్యూ సెక్కులు, మధ్యాహ్నం ఒంటి గంటకు 28,396 క్యూసెక్కులు, మధ్యాహ్నం 3 గంటలకు 30,445 క్యూసెక్కులు, సాయంత్రం 5 గంటలకు 21,878 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 4 గంటల తర్వాత ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది.

తమ్మిలేరు రెగ్యులేటర్‌ నుంచి వరద నీటి విడుదల

చింతలపూడి: తమ్మిలేరు రిజర్వాయర్‌ ఎగువన, పరీవాహక ప్రాంతాల్లో వర్షాల జోరుతో తమ్మిలేరు గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం నీటి మట్టం 350 అడుగులు చేరింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులు వస్తుండగా, ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి నాలుగు వేల క్యూసెక్కులు వరద నీటిని విడుదల చేస్తున్నట్లు  ప్రాజెక్టు అధికారి డి.అప్పారావు తెలిపారు.


బుట్టాయగూడెం: ఏజెన్సీలో కురిసిన వర్షం కారణంగా జల్లేరు జలాశయానికి 260 ఇన్‌ప్లో క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్లు ఇరిగేషన్‌ ఏఈ కిరణ్‌ తెలిపారు.