మాది కొరోనా.. మాకు కరోనా లేదు.. ఈ వార్తేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-03-30T01:14:44+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న ఒకేఒక్క పేరు కరోనా. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా...

మాది కొరోనా.. మాకు కరోనా లేదు.. ఈ వార్తేంటో తెలిస్తే..

సీతాపూర్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న ఒకేఒక్క పేరు కరోనా. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 31,027 మందిని బలిగొన్న కరోనా వైరస్ గురించి అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. పల్లెల నుంచి పట్టణాలు, నగరాల దాకా కరోనా గురించే చర్చ. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామ ప్రజలకు వింత కష్టమొచ్చింది. ఆ సమస్య మరేదో కాదు.. కరోనానే. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్యగా మారితే.. ఈ ఊరికి మాత్రమే కొత్తగా వచ్చిన కష్టంగా చెబుతున్నామని కొట్టిపారేయకండి.


ఈ ఊరికొచ్చిన వింత కష్టమేంటంటే.. ఆ గ్రామం పేరు కొరోనా. గత కొద్ది రోజులుగా ఆ ఊరి జనం వారి గ్రామం పేరు బయటచెప్పడానికే భయపడుతున్నారు. తమది కొరోనా గ్రామమని చెప్పగానే.. తమను దూరం పెడుతున్నారని ఆ ఊరి జనం లబోదిబోమంటున్నారు. తమకు కరోనా రాలేదని, తమది కొరోనా అని చెప్పినా వినిపించుకునే స్థితిలో ఇతరులు ఉండటం లేదని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. కొరోనా గ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా పరిధిలో ఉంది. తమ ఊరి పేరే తమకు సమస్యగా మారుతుందని, ఊరి పేరు వల్ల తమపై వివక్ష చూపుతారని కలలో కూడా అనుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు.



Updated Date - 2020-03-30T01:14:44+05:30 IST