100 రోజుల్లో ఏసీబీ కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2021-04-19T09:51:55+05:30 IST

అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల కేసులను 100 రోజుల్లో పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

100 రోజుల్లో ఏసీబీ కేసుల పరిష్కారం

టైంలైన్‌ సవరిస్తూ ఉత్తర్వులు జారీ 


అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల కేసులను 100 రోజుల్లో పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ తరహా కేసులు ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో ఎక్కువమంది ఉద్యోగులు సస్పెన్షన్‌లో ఉంటూ సుదీర్ఘ కాలం పాటు సగం జీతాలు పొందుతున్నారు. వారిపై సత్వర చర్యలు లేకపోవడంతో అవినీతి మరింత పెరిగిపోతోందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కేసుల పరిష్కారం కోసం ప్రస్తుతం ఉన్న కాల పరిమితిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన అధికారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే 24గంటల్లోపు అరెస్టు చేస్తారు. ఆ విషయం ఏసీబీ కోర్టు వెంటనే ఏపీవీసీకి సమాచారం ఇవ్వాలి. సంబంధిత శాఖ 2రోజుల్లోపు సదరు ఉద్యోగిని సస్పెండ్‌ చేయాలి. ఏసీబీ అధికారులు ఆయా శాఖలకు 30 రోజుల్లోపు తుది నివేదిక అందించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2021-04-19T09:51:55+05:30 IST