పర్శపల్లిలో మద్యపానం నిషేధిస్తూ తీర్మానం

ABN , First Publish Date - 2020-02-28T10:56:33+05:30 IST

మండలంలోని పర్శపల్లి గ్రామంలో మద్యపానం నిషేధించాలని గ్రామ సర్పంచుతో పాటు వార్డు సభ్యులు, గ్రామస్థులు గ్రామ పంచాయతీలో గురువారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.

పర్శపల్లిలో మద్యపానం నిషేధిస్తూ తీర్మానం

కోహీర్‌, ఫిబ్రవరి 27: మండలంలోని పర్శపల్లి గ్రామంలో మద్యపానం నిషేధించాలని గ్రామ సర్పంచుతో పాటు వార్డు సభ్యులు, గ్రామస్థులు గ్రామ పంచాయతీలో  గురువారం  ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ బంటు తుల్జమ్మ మాట్లాడుతూ మద్యంతో జరిగే నష్టాలను వివరించారు. మద్యం మత్తులో చాలా మంది చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామంలో ఎంతోమంది మద్యపానానికి బానిసలై అనేక రకాలుగా నష్టపోయారన్నారు. ఇక నుంచి గ్రామంలో మద్యాన్ని విక్రయించరాదన్నారు. ఇక నుంచి గ్రామంలో బెల్ట్‌షాప్‌ నిర్వహిస్తే రూ.50వేలు, తాగి వచ్చి గ్రామంలో గొడవలకు దిగితే రూ. 25వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం మద్యపానాన్ని నిషేధించాలని తీర్మానం చేసి తీర్మానపత్రాన్ని పోలీస్‌ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లవయ్య, గ్రామస్థులు రామకృష్ణ,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T10:56:33+05:30 IST