వినతులను సత్వరమే పరిష్కరించండి

ABN , First Publish Date - 2020-12-01T05:03:46+05:30 IST

టెలీ స్పం దనలో అందించిన వినతులను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు.

వినతులను సత్వరమే పరిష్కరించండి

 స్పందనలో ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ 

పార్వతీపురం, నవంబరు 30:  టెలీ స్పం దనలో అందించిన వినతులను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో స్పం దన కార్యక్రమం నిర్వహించారు. కురుపాం మండలం రస్తాకుంటుబాయి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు మండంగి చంటి, పాలక మల్లేష్‌లు 2019 నుంచి పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నామని, తమకు జీతాలు ఇంతవరకు అందలేదని, జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాచిపెంట మం డలం పనుకువలస పంచాయతీ కొస్తువలస గ్రామానికి చెందిన చెల్లురి వీరయ్య, తది తరులు చెల్లురిరాణీ బంద చెరువుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పనులు చేయించి తమ భూములకు నీరందించాలని దరఖాస్తు చేశారు. పార్వతీపురం మండలం బందలుప్పి గ్రామానికి చెందిన పి.అప్పారావు 2014-15లో మూడు మరుగుదొడ్లు నిర్మించానని, వా టికి సంబంధించిన బిల్లులు ఇంతవరకు అందలేదని, ఆ డబ్బులు ఇప్పించాలని కోరా రు. ఇలా పలు సమస్యలపై వినతులు పెద్ద ఎత్తున అందాయన్నారు. ఈ కార్య క్రమంలో ఏపీవో సురేష్‌కుమార్‌, డీడీ కిరణ్‌కుమార్‌, ఈఈ శాంతేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వార్డు సచివాలయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, సచివాలయాలకు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పీవో కూర్మనాథ్‌ ఆదేశించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బెలగాం 1, 2 వార్డు సచివాలయాలను పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను తప్పకుండా అనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బంది సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.


Updated Date - 2020-12-01T05:03:46+05:30 IST