వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారం: పవన్‌

ABN , First Publish Date - 2022-03-15T01:21:25+05:30 IST

వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన ఆవిర్భావ సభలో

వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారం: పవన్‌

అమరావతి: వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ వైసీపీలో బూతులు తిట్టే వారితో పాటు మంచి నేతలూ ఉన్నారని తెలిపారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉండాలా..? అని ప్రశ్నించారు. పార్టీ నడపడానికి కావాల్సింది సిద్ధాంతమని చెప్పారు. ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుందని పేర్కొన్నారు. నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలన్నారు. నాయకుడికి ఉండాల్సింది పట్టు, విడుపు అని తెలిపారు. ప్రశ్నించడమంటే మార్పునకు శ్రీకారమని వ్యాఖ్యానించారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-15T01:21:25+05:30 IST