‘100’కు కాల్‌ వచ్చిన వెంటనే స్పందించాలి

ABN , First Publish Date - 2021-02-24T05:30:00+05:30 IST

డయల్‌ 100కు కాల్‌ వచ్చిన వెంటనే బ్లూకోల్ట్‌, పెట్రోకార్‌ సిబ్బంది స్పందించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

‘100’కు కాల్‌ వచ్చిన వెంటనే స్పందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

 సమీక్షా సమావేశంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి


సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 24: డయల్‌ 100కు కాల్‌ వచ్చిన వెంటనే బ్లూకోల్ట్‌, పెట్రోకార్‌ సిబ్బంది స్పందించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతల రక్షణకు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్‌ కేసుల వివరాలపై సంగారెడ్డిలోని పోలీసు కళ్యాణ మండపంలో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డయల్‌ 100కు కాల్‌ వచ్చిన వెంటనే స్పందిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్‌ చేసి, వివరాలను టెక్‌డాటమ్‌ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ప్రతీ నెల నేర సమీక్షా సమావేశంతో పాటు పోలీసు అధికారుల విధులకు సంబంధించి కూడా డీజీపీ సమీక్షిస్తున్నారని చెప్పారు. జిల్లా పనితీరు సంతృప్తికరంగా వుండేలా ఎస్‌హెచ్‌ఓలంతా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ కె.సృజన, డీఎస్పీలు సత్యనారాయణ, శంకర్‌రాజు, భీమ్‌రెడ్డి, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నాయుడు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.  


Updated Date - 2021-02-24T05:30:00+05:30 IST