Abn logo
Sep 22 2021 @ 23:39PM

‘స్పందన’ వినతులపై తక్షణమే స్పందించండి


కలెక్టరేట్‌: స్పందన కార్యక్రమానికి వచ్చిన వినతులపై తక్షణమే స్పందించి అర్జీదారులకు సంతృప్తికరమైన సమాచా రాన్ని అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి  అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. స్పందన వినతులపై ముఖ్యమంత్రితో పాటు కలెక్టర్‌ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నా చాలా శాఖల్లో అర్జీలు పరిష్కారం కావడంలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా వరకు అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వచ్చిన అర్జీలను పరిష్కరించడం రోజువారీ కార్యక్రమంలో ఒక భాగం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయ విభాగాధిపతులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.