సమస్యలపై సత్వరమే స్పందించండి

ABN , First Publish Date - 2021-10-22T06:35:07+05:30 IST

గ్రామాల్లో సమస్యలపై మహిళా పోలీసులు సత్వరమే స్పందించాలని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ సూచించారు.

సమస్యలపై సత్వరమే స్పందించండి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ సునీల్‌

అనకాపల్లి డీఎస్పీ సునీల్‌ 


చోడవరం, అక్టోబరు 21: గ్రామాల్లో సమస్యలపై మహిళా పోలీసులు సత్వరమే స్పందించాలని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో చోడవరం సర్కిల్‌, సబ్బవరం పోలీసు స్టేషన్‌ పరిధిలోని మహిళా పోలీసులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసుల బాద్యతలు, విధులపై ఆయన మాట్లాడారు. తమకు కేటాయించిన గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ స్థానికంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించాలని సూచించారు. అలాగే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. మహిళలు, యువతుల సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించాలని, వారికి ధైర్యం కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఐ షేక్‌ ఇలియాస్‌ మహ్మద్‌, ఎస్‌ఐలు ఎ.విభీషణరావు, యమున, సర్కిల్‌ పరిధిలోని అన్ని మండలాల ఎస్‌ఐలు, గ్రామ మహిళా పోలీసులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T06:35:07+05:30 IST