స్పందించిన కేటీఆర్... కానిస్టేబుల్‌పై వేటు

ABN , First Publish Date - 2020-04-02T23:49:26+05:30 IST

వనపర్తిలో వ్యక్తిపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్‌ అశోక్‌‌ను సస్పెండ్ చేస్తునట్లు జిల్లా ఎస్పీ అపూర్వారావు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూస్తామన్నారు.

స్పందించిన కేటీఆర్... కానిస్టేబుల్‌పై వేటు

వనపర్తి: వనపర్తిలో వ్యక్తిపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్‌ అశోక్‌‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అపూర్వారావు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూస్తామన్నారు. ఈ ఘటన నేపథ్యంలో వనపర్తి పోలీసుల తీరు ప్రశ్నార్థకంగా మారింది. వనపర్తికి చెందిన మురళీకృష్ణ (బాధితుడు) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా ప్రభావంతో అతడికి ఇంటి దగ్గర నుంచి పనిచేసేవిధంగా కంపెనీ వెసులుబాటు కల్పించింది. దీంతో మురళీకృష్ణ కుటుంబంతో సహా వనపర్తికి వచ్చాడు. అయితే బుధవారం సాయంత్రం మురళీకృష్ణ కుటుంబసభ్యులు నలుగురు కలిసి రెండు బైక్‌పై ఏదో పనిమీద వెళ్తున్నారు.


ఈ క్రమంలో బాధితుడి వెళ్తున్న బైక్‌ను పోలీసులు ఆపారు. తన కుమారుడితో కలిసి వెళుతున్న మురళీకృష్ణకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కిందపడేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. అక్కడున్న పోలీసులు అతన్ని విడిపించి జీపులో కూర్చోబెట్టారు. అయితే అక్కడే ఉన్న ఆ వ్యక్తి కుమారుడు బెంబేలెత్తిపోయి.. ‘డాడీ వద్దు.. అంకుల్ ప్లీజ్’ అంటూ కన్నీళ్లతో వేడుకోవడం అందరినీ కలచి వేసింది. ఈ వీడియో మంత్రి కేటీఆర్‌ను చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. కొంతమంది ప్రవర్తనతో వేలాదిమంది కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలను కోరారు. దీంతో మంత్రి, డీజీపీ ఆదేశాలతోనే కానిస్టేబుల్ అశోక్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-04-02T23:49:26+05:30 IST