వ్యాక్సినేషన్‌కు స్పందన

ABN , First Publish Date - 2021-01-21T05:14:29+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు మంచి స్పందన లభిస్తోంది. మొదట్లో వ్యాక్సిన్‌ వేసుకుంటే, ఇతరత్రా దుష్ఫరిణామాలు వస్తాయనే భయంతో కొందరు వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నారు.

వ్యాక్సినేషన్‌కు స్పందన
ప్రొద్దుటూరులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం

ఐదు రోజుల్లో 464 మందికి వ్యాక్సిన్‌


ప్రొద్దుటూరు క్రైం, జనవరి 20 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు మంచి స్పందన లభిస్తోంది. మొదట్లో వ్యాక్సిన్‌ వేసుకుంటే, ఇతరత్రా దుష్ఫరిణామాలు వస్తాయనే భయంతో కొందరు వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నారు. అయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో, వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రితో పాటు కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. 16 నుంచి 20వ తేదీ వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగింది. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఐదు రోజుల్లో 241 మందికి వ్యాక్సిన్‌ వేయగా, కల్లూరు కేంద్రంలో 223 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మొత్తంగా 464 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు జిల్లా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మిప్రసాద్‌ తెలిపారు.  ఇదిలా ఉండగా, బుధవారం స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. మున్సిపల్‌ కమిషనర్‌ రాధ, అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌లు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. తొలిగా ఆ కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ సాయిప్రసాద్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇక్కడ మొదటి రోజు 120 మంది వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ వేయాల్సి ఉండగా, 60మందికి వ్యాక్సిన్‌ వేశారు. కార్యక్రమంలో పీపీ యూనిట్‌ వైద్యాధికారిణి డాక్టర్‌ ఇలియారాణి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ ఎంవీ సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 


మైలవరంలో 73 మందికి....

మైలవరం, జనవరి 20: మైలవరం, వద్దిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో  73 మందికి కరోనా టీకా  వేసిన ట్లు మైలవరం వైద్యాధికారి అజరయ్య తెలిపారు. బుధవారం మొదటి విడతలో 120 మంది ఆరోగ్యశాఖ సిబ్బందికి, ఆశావర్కర్లకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు 73 మందికి వ్యాక్సినేషన్‌  జరిగిందన్నారు. తహసీల్దారు శివరామయ్య, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, వైద్యాదికారి చంద్ర తదితరులు పాల్గొన్నారు. 


రాజుపాలెంలో 70 మందికి...

రాజుపాలెం, జనవరి 20: రాజుపాలెం మండలంలో 70 మం దికి వ్యాక్సిన్‌ వేసినట్లు మండల వైద్యాధికారి సురేష్‌బాబు తెలిపారు. బుధవారం రాజుపాలెంలోని పీహెచ్‌సీలో 120మం ది వైద్య, అంగన్వాడీ తదితర సిబ్బందికి గాను 70 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉదయభారతి, ఏఎస్‌ఐ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:14:29+05:30 IST