విజయం సాధించే వరకు విశ్రమించం

ABN , First Publish Date - 2022-01-18T05:54:55+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయంలో విజయం సాధించే వరకు విశ్రమించమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు

విజయం సాధించే వరకు విశ్రమించం
రిలే దీక్షలో పాల్గొన్న ఉక్కు కార్మికులు, ప్రతినిధులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జనవరి 17: స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయంలో విజయం సాధించే వరకు విశ్రమించమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు 340వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో  ఈఎస్‌ అండ్‌ ఎఫ్‌, ఈఆర్‌ఎస్‌, సేఫ్టీ, టెక్‌సెల్‌, ఎస్‌ఎస్‌డీ, ఆగ్రో విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ   ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ ఉక్కుకు సముచిత స్థానముందని, ఉక్కు కర్మాగారంపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.    పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు గంధం వెంకటరావు మాట్లాడుతూ ప్రైవేటు రంగాలకు పెద్దపీట వేయటానికి ప్రభుత్వ రంగ సంస్థలను హరించడం తగదన్నారు.  ఈ శిబిరంలో కార్మిక సంఘాల నాయకులు వరసాల శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, రామచంద్రరావు, మస్తానప్ప తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T05:54:55+05:30 IST